Logo
Date of Publish : 01 May 2023, 4:04 pm
Editor : Sake Naresh

రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఏలూరులో అంతర్జాతీయ శ్రామిక దినోత్సవ వేడుకలు

         ఏలూరు ( జనస్వరం ) : రెడ్డి అప్పలనాయుడు గారి ఆధ్వర్యంలో 137 వ అంతర్జాతీయ శ్రామిక దినోత్సవ వేడుకలు స్థానిక మార్కెట్ యార్డ్ లోని ఐఎఫ్టియు కార్యాలయం వద్ద, ఏలూరు వన్ టౌన్ మార్కెట్ సెంటర్ లోనూ, మెయిన్ బజార్ కన్నయ్య పార్క్ వద్ద, హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు, రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు.‌. ఈ సందర్భంగా హమాళీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కార్మికులు కష్టపడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవడానికి మాత్రమే కాకుండా, పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి మొత్తం సమాజాన్ని విముక్తి చేయడం కోసం పునరంకితం అవ్వాలని ప్రతిజ్ఞ చేశారు.. ప్రపంచవ్యాప్తంగా కార్మికవర్గం మేడే జరుపుకుంటున్న ఈ సందర్భంలో, పెట్టుబడిదారీ దేశాలలో 8 గంటల పని దినంతో పాటుగా కష్టపడి సాధించుకున్న హక్కులన్నీ దాడికి గురవుతున్నాయని అన్నారు..వేతనాలు, బోనస్,పింఛన్లు కోతకు గురవుతున్నాయని, పూర్తి పెన్షన్ పొందేందుకు రిటైర్మెంట్ వయసు పెంచుతున్నారని,కార్మిక సంఘాల హక్కులపై, మరీ ముఖ్యంగా సమ్మె చేసే హక్కుపైన దాడి జరుగుతోందన్నారు.. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే,మా శక్తికి కూడా పరిమితులు ఉంటాయని, ఈ చాకిరీ మేం చేయలేమని పనిముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడటం, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శన మన్నారు.24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి (రెస్టు),ఇంకా ఎనిమిది గంటలు రిక్రీయేషన్ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకోవడం జరిగిందన్నారు.. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్, హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు, హమాలీ వర్కర్లు పాల్గొన్నారు..


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com