కురుక్షేత్రానికి ముందు జరిగిన చిన్న సంఘటన
కృష్ణుడు – యుద్ధంలో నీకు ఆయుధాలు కావాలా? లేక నేను నీకు తోడుగా ఉండాలా? అంటే దుర్యోధనుడు – ఆయుధాలే కావాలి అంటాడు. సుదర్శన చక్రాన్ని ధరించిన జగత్రక్షకుడు అయిన కృష్ణుడ్ని వదులుకోవడమే కౌరవులు చేసిన అతిపెద్ద తప్పు. బుర్ర లేక చేసిన ఈ మొదటి తప్పిదమే అంతానికి నాంది పలికింది. ఎంత పెద్ద సైన్యం, ఆయుధాలు ఉంటే ఏం లాభం? కృష్ణుడు లేడు కదా?? ఇది గ్రహించి ఉండుంటే కౌరవులు గెలిచేవారేమో… కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అధికార మదంతో విర్రవీగుతున్న దుర్యోధనుడికి అర్థం కాకపోయినా అధిక సంఖ్యలో ఉన్న కౌరవ సైన్యానికి బాగా అర్థం అయింది. ఎవరిని ఎప్పుడు ఎలా వాడాలో ? మొన్నటి దాకా మినిస్టర్ పదవులకోసమో లేక మరేతర పనుల కోసమో తమ నాయకుడి మెప్పు పొందడానికి ప్రెస్మీట్లు పెట్టి జనసేనాని పవన్ కళ్యాణ్ మీద ఇష్టానుసారంగా వాగిన వైసీపీ నాయకులు ఇప్పుడు జ్ఞానోదయం అయినట్టు ఉంది. ఎక్కడా ప్రెస్మీట్లు లేవు, వెగతాళిగా వాగుడు లేదు.
కారణాల్లోకి వెళితే, జగన్ చేస్తున్న అరాచకపాలానికి విసిగి పోయిన జనాలు… జనసేన చేస్తున్న సమర్థమైన రాజకీయానికి అన్నీ సామాజికవర్గాలను మెప్పిస్తుంటే, కాపు సామాజికవర్గం మరింత పటిష్టంగా జనసేనకు జేజేధ్వానాలు పలకడమే ముఖ్యమైన కారణం. లేనిదానికి ఉన్నదానికి సంబంధం లేకుండా ప్రతీవిషయంలో పవన్ కళ్యాణ్ ని కాపు నాయకులతో తిట్టించడమే వైస్సార్సీపీ అధిష్టానం లక్ష్యంగా పెట్టుకోవడం చూసి విసిగిపోయారు కాపు సామాజిక వర్గం. అందుకే ఈసారి ఎన్నికలలో కాపులకి పవన్ కళ్యాణ్ చెప్పిందే వేదంగా వ్యవహరించాలి అని కంకణం కట్టారు. ఇది ఇలా ఉండగా కిందటి ఎన్నికల వరకు వైస్సార్సీపీ నాయకులతో ఉన్న కాపులలో పెద్ద నాయకులు కూడా మొహం చాటేయడంతో ఆ పార్టీ నాయకులకి సమస్థం బోధపడినట్టు ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ విషయంలో ఆచి తూచి మాట్లాడుతున్నారు. నోరు జారడం, తిట్టడమేకాదు ప్రెస్మీట్ పెట్టాలన్నా ఒకటికి వంద సార్లు ఆలోచిస్తున్నారు. అమర్ నాథ్, అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటి వాళ్లు తప్ప ఇంకెవరు నోరు మెదపట్లేదు. ఈమధ్య వాళ్లు ప్రెస్మీట్లు పెట్టి అనవసరంగా తిడుతుంటే తోటి ఎమ్మెల్యేలు పెదవి విరుస్తున్నారు. మనమేదో మన పార్టీ విధానాలు ఎంటో చూసుకొని పోకుండా ఇలా అర్దరాహిత్యంతో మాట్లాడుకొని పార్టీని నాశనం చేసే స్థాయికి దిగజారుస్తున్నారు అని అంతర్గత సమావేశం నుండి వచ్చిన సమాచారం. ఎందుకూ పనికిరాని ఈ ప్రెస్మీట్లు ఆపకపోతే వాళ్ళ ఎమ్మెల్యే సీట్ గండిపడేలా ఉందని మిగతా ఎమ్మెల్యేలు సైలెంట్గా జారుకుంటున్నారు. వచ్చే సార్వత్ర ఎన్నికలకు ప్రచారంలో వైస్సార్సీపీ ప్రభుత్వ తప్పిదాలు జనాలు ఎత్తిచూపటమే కాకుండా… పవన్ కళ్యాణ్ విషయంలో చేసిన తప్పులు జనాల నుండి ఎదుర్కోవాల్సి ఉందని గ్రహించిన నేతలు, వాటికి కూడా సిద్ధం అవ్వాల్సి ఉందని బెంబేలెత్తుతున్నారు. జగన్ మోహన్ రెడ్డికి చెప్పినా వినడు అని తేల్చేసిన కొంతమంది నాయకులు… పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులకి గోడు వెళ్లబుచ్చారని సమాచారం.
2019 జనసేనాని ఓటమి తరువాత ఎన్నో ఊహాగానాల మధ్య పార్టీ స్థితిగతుల్లో ఎన్నో అనుమానాలు సాగగా… సామాన్య ప్రజల్లో జనసేనపార్టీ గాలికి ఎగిరొచ్చిన కాగితంలా అవుతుందేమోనన్న అనుమానాలు లేకపోలేదు. అంతటి సంక్లిష్ట పరిస్థితి నుండి జనాల్లో మెట్టు మెట్టు ఎదుగుతూ సమగ్ర ప్రతిపక్ష నేతగా ఎదగడం సామాన్య జనాల్లో ఆసక్తి రేకెత్తిచింది. అధికారపక్ష పార్టీ తప్పులు ఎండగడుతూ, పాలసీల మీద పక్కాగా మాట్లాడుతూ… పార్టీ సొంత స్వలాభాలు పక్కన పెట్టి మరీ జనం కోసం చేసిన పోరాట ప్రతిభ సామాన్య జనాల్లో ఆశా జ్యోతిగా వెలిగాడు పవన్ కళ్యాణ్. క్లిష్ట పరిస్థితుల్లో రోజు కూలీల కోసం నిలబడిన విధానం నుండి జనవాణి కార్యక్రమాలో ప్రజల సమస్యలు తీర్చడంలో విజయం సాధించాడు. జరిగిన పరిణామాలు చూస్తున్న ప్రజలకి జనసేనపై ఎంతో ఆకర్షితులై జనసేనకి మద్దతు తెలపడం తట్టుకోలేక అధికార పక్షం ఇష్టం వచ్చినట్టు బూతులు పురాణం తిడుతుంటే, జనసేనాని మాత్రం తన పట్టు కోల్పోకుండా పాలసీల మీద ప్రజల పక్షాన నిలపడడం హర్షించాల్సిన విషయం అని రాష్ట్రం మొత్తం గళమెత్తారు. ఈ వైస్సార్సీపీ బూతు వ్యాఖ్యలు అప్పటికి ఉపయోగపడ్డాయేమో గాని, ఇప్పుడు అవి సొంత పార్టీకి యమపాశంగా మారాయాయని సొంత కార్యకర్తలే విశ్లేషించుకుంటున్నారు. ఇప్పుడు తెలివైన వైస్సార్సీపీ నాయకులు పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండడం శ్రేయస్కరమని భావిస్తున్నారు. కొంతమంది నాయకులు ఐతే జనసేన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని భావిస్తున్నట్టు అంతర్గత సమావేశాల నుండి వచ్చిన సమాచారం. ఉన్న 151 మంది ఎమ్మెల్యేలలో 3-4 తప్ప మిగతా వాళ్ళు మౌనము వహించడం ఇదే కారణం. తద్వారా సామాన్య ప్రజలలో జనసేన ఓటు బ్యాంక్ పెరగడమే కాకుండా, జనసేన గ్రాఫ్ కూడా పెరిగింది.
ప్రజల నుండి సేకరిస్తున్న సర్వేలు వైస్సార్సీపీ ఎమ్మెల్యేలని మరింత ఆందోళన కలిగిస్తున్నాయి అనే విషయం అక్షరాలా సత్యం. జనసేన ఒంటరిగా పోటీ చేసినా చేయకున్నా వైస్సార్సీపీ అధికారం కోల్పోవడం తప్పదు అనే విషయం వాళ్ళ సొంత సర్వేలు చెపుతుంటే గుండెల్లో జ్వాలలు రేగుతున్నాయి. ఇప్పటి వరకు ఇష్టానుసారంగా సమయం సందర్భం లేకుండా కూతలు కూసిన వాళ్లు ఈసారి భారీ మెజారిటీల్లో ఓడిపోతున్నట్టు, అలాగే ఇప్పటికి ఆపకుండా కూస్తున్న ఎమ్మెల్యేల డిపాజిట్లు కోల్పోవడం తప్పదు అని ఈ సర్వేలు చెప్పడంతో మరింత జాగ్రత్త పడ్డారు. ఇపుడు జనసేన, టీడీపీ పొత్తుతో 2024 ఎన్నికల్లో కలసి రావడంతో వైసీపీ నాయకుల్లో మరింత భయం పట్టుకుంది. 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా, టీడీపీ, బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడంతో వైసీపీ ఓటమి ఎంత భయంకరంగా ఉందో వాళ్ళు అనుభవించారు. ఇప్పుడు అదే పరిస్థితి రిపీట్ కానుందని వైసీపీ నాయకుల్లో భయం పట్టుకుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
written by
ట్విట్టర్ ( X ) : @AndhraThanos_