Logo
Date of Publish : 27 April 2021, 8:59 am
Editor : Sake Naresh

విద్యార్థుల జీవితాలతో చెలగాటమా.. తక్షణమే పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలి : జగ్గయ్యపేట జనసేన నాయకులు

                  దేశంలో అదే విధంగా రాష్ట్రంలో కరోనా రెండవ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు రద్దు చేపించాలని కోరుతూ పట్టణ విద్యార్థులు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు ఈమని కిషోర్ కుమార్ కి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి ఈ మాత్రం బాధ్యత లేదని అర్ధమవుతుంది అని, రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతూ ఉంటే పదవ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు రద్దు చేయమని విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతుంటే ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్టు వ్యవహరిస్తుందని ఆయన మండి పడ్డారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు నిర్వహించే ఈ పరీక్షల వలన విద్యార్థులనే కాకుండా వారి కుటుంబాలను కూడా కరోనా ముప్పులోకి నెట్టేస్తున్నారని, సీ బీ ఎస్ ఈ కూడా పరీక్షలను రద్దు చేసిందని, ఒక్క ఏపి ప్రభుత్వానికే మిలట్రీ నియామకాల ఇబ్బంది వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులు కూడా కరోన తాకిడికి కళాశాలకు వెళ్లకపోవటంతో పూర్తిగా చెప్పని సిలబస్ తో ఈ విధంగా వెళ్లి పరీక్షలు రాయాలి అని తెలిపారు. మరొక్క సారి ప్రభుత్వం దీని పైన సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి, పునరాలోచించి విద్యార్థుల జీవితాలను దృష్టిలో పెట్టుకుని పరీక్షలను రద్దు చేయవలసిందిగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యం గారి తరుపున, విద్యార్థుల తరుపున వారి కుటుంబాల తరుపున కోరుచున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు త్రిశాంత్, సోహైల్, హేమంత్, నాగరాజు, అవినాష్, రోహిత్, సత్య తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com