Logo
Date of Publish : 23 December 2021, 6:48 am
Editor : Sake Naresh

విద్యార్థుల జీవితాలతో చెలగాటమొద్దు? అనంతపురం జిల్లా జనసేనపార్టీ నాయకులు

   అనంతపురం, (జనస్వరం) : విద్యార్దుల జీవితాలతో చెలగాటం ఆడే విధంగా SSBN విద్యా సంస్థల యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు సరైందీ కాదని జనసేన నాయకులు మండిపడ్డారు. మంగళవారం  SSBN విద్యార్థులకు మద్దతుగా జనసేన ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్‌ జయరామిరెడ్డి మాట్లాడుతూ... SSBN కళాశాలను ప్రైవేటీకరణ చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. వేలాది మంది విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేసిన ఈ కళాశాల కరవు జిల్లా విద్యార్థులకు కల్పతరువు అన్నారు. చదువుల తల్లిలాంటీ ఈ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్న కళాశాల యాజమాన్య దుందుడుకు చర్యలకు విద్యార్థులతో కలిసి జనసేన కళ్లెం వేస్తుందన్నారు. అవసరమైతే జనసేనాని పవన్‌ కల్యాణ్‌ గారి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరించారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులకు జనసేన నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు జనసేన నాయకులు జయరామి రెడ్డి, అంకె ఈశ్వరయ్య, లీగల్‌ సెల్‌ అధ్యక్షులు జీ. మురళీ క్రిష్ణ, చరణ్‌ తేజ్‌, ఎంవి శ్రీనివాసులు తదితర నాయకులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. అనంతరం సొంత పూచీ కత్తుపై వారిని విడుదల చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com