
తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని సత్యవేడు నియోజకవర్గంలో మేధోమధనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికల గురించి, పార్టీ బలోపేతం గూర్చి చర్చించడం జరిగింది. పిచ్చాట్టూరు మండలం అరణియార్ పోజెక్టు గూర్చి చర్చించి ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణటించుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ను నవీకరణ చేసి టూరిజం కింద అభివృద్ధి చేస్తే అద్భుతమైన ప్రయోజనం కలుగుతుందని అని అన్నారు. తెలుగు గంగ నీటిని దీనికి అనుసంధానం చేస్తే భవిష్యత్ లో మిగిలిన మండలాలకు నీటి ఎద్దడిని అరికట్టవచ్చు అని జనసేన నాయకులు అన్నారు. అలాగే కెవిబిపురం, వరదయ్యపాలెం, B.N. కండ్రిగ, సత్య వేడు మండలాలలో అరవై వేల మంది జనసంచారం ఉన్నా అంబులెన్స్ సౌకర్యం లేద ని జనసేన పార్టీ తరుపున పొరాడి ఆ ప్రాంతాలకు అంబులెన్స్ సౌకర్యాన్ని తీసుకురావాలని, అందుకు తగిన విధంగా పోరాటం చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. మండల అడహక్ కమిటీ నిర్మాణం మరియు క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్య క్రమం గురించి విశ్లేషణ చేసి గ్రామాల్లో మరింత క్రీయాశీలక సభ్యత్వాలను నమోదు చేయాలని జనసైనికులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యుగంధర్ పొన్న, K. లావణ్య కుమార్, K. శ్రీనివాసులు, E. సుబ్రహ్మణ్యం, హేమ సుందరం, కోదండరామయ్య (జానీ), బొమ్మినేటి దన రాంమూర్తి, అయ్యప్ప కిషోర్, ప్రేమ్ కుమార్, పర్విన్ బాషా, కిషోర్, బాలాజీ చంద్ర శేఖర్, Sai కుమార్ రెడ్డి, భార్గవ్, సురేష్, దినేష్, వంశీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.