Logo
Date of Publish : 02 November 2025, 8:51 pm
Editor : Sake Naresh

అనుక్షణం అప్రమత్తం… ప్రతిక్షణం పర్యవేక్షణ

2020 ఆగస్టు నుంచి నవంబర్ మధ్యలో రాష్ట్రానికి వచ్చినవరదలు, నివర్ తుపాన్ రాష్ట్ర రైతాంగానికి ప్రజలకు నిండాముంచాయి.రాష్ట్ర వ్యాప్తంగా 37 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. రూ.7,400 కోట్లకు పైగా రైతులు నష్టపోయారు. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ అప్పటి సీఎం మాత్రం ప్యాలెస్ లో నుంచి గడప దాటలేదు. ఇంట్లో కూర్చొని రివ్యూలు చేస్తూ మమ అనిపించేశారు. ముందస్తుగా అప్రమత్తం చేసేలా యంత్రాంగం చర్యలు తీసుకోలేదు.రైతు భరోసా కేంద్రాలు రైతులకు భరోసా ఇవ్వలేదు. దాదాపు 37 లక్షల ఎకరాల పంట నష్టం వాటిల్లినా రైతులకు న్యాయం చేయలేదు. తీరా తుఫాన్ తీవ్రత తగ్గిన నాలుగు రోజుల తర్వాత ఏరియల్ సర్వే చేసి తిగిరి తాడేపల్లిప్యాలెస్‌కు చేరుకున్నారు.

కానీ 2025 అక్టోబర్ 28- 29 న వచ్చిన మొంథా తుపాన్ 2020లో వచ్చిన నివర్ తుపాన్ కంటే తీవ్రత ఎక్కువ. గంటకు 110 కి.మీ. వేగంతో తీరంవైపు దూసుకువచ్చింది. దాదాపు 12 వేల హెక్టార్ల పంట దెబ్బతింది. 76 వేల మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాన్ కంటే మూడు రోజుల ముందుగానే సీఎం చంద్రబాబు గారు సమీక్ష నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు. పాఠశాలలకు సెలువులు ప్రకటించి, ఆరబెట్టిన ధాన్యం తరలించేలా ఏర్పాట్లు చేశారు. విద్యుదాఘాతం కలగకుండా ముందస్తుగానే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నిర్వాసిత కుటుంబాలను ముందస్తుగానే పునరావాస కేంద్రాలకు తరలించి వారికి వసతి సౌకర్యాలు కల్పించారు. తుపాన్ సయమంలోనే వరద ప్రాంతాల్లో పర్యటించి నిర్వాసితులకు భరోసా కల్పించారు. ప్రజల ప్రాణాలను గాలికి వదిలేయలేదు. అన్నమయ్య ప్రాజెక్ట్ ను వరదల్లో ముంచేసి 31 మంది ప్రాణాలు జగన్ తీసేస్తే... విపత్తుల వేళ ఒక్క ప్రాణం కూడా పోకూడదని కూటమి ప్రభుత్వం పనిచేసింది.'జీరో క్యాజువాలిటీ' లక్ష్యంతో ముందస్తు చర్యలు తీసుకున్నారు.అన్ని శాఖలను సమాయత్తం చేస్తూ ఒక్క పక్కా ప్రణాళికతో తుపాన్ నుంచి ప్రజలు సురక్షితంగా బయటపడేలా పనిచేశారు. మొంథా తుపాన్‌పై ప్రభుత్వం తీసుకున్న చర్యలను పక్క రాష్ట్రాల రాజకీయ నాయకులకు కూడా శభాష్ అంటూ మెచ్చుకున్నారు.

వరదలపై ఎక్కడికక్కడ పర్యవేక్షణ:
మొంథా తుపాన్ దాటికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి వరద బీభత్సం సృష్టించింది. ప్రకాశం జిల్లా కొండేపి మండలం చోడవరంలో వరద ఉధృతి ఎక్కువైంది. వరదలో చిక్కుకున్న 100 మంది కూలీలను బోట్ల సాయంతో కూలీలను ప్రభుత్వం కాపాడింది. అలాగే భారీ వర్షాలకు వెలుగొండ టన్నెల్ లో 9 కిలోమీటర్ల మేరా నీరు చేరింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు టన్నెల్ లో పనిచేస్తున్న 250 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. వెలుగొండ టన్నెల్ లో రివాటరింగ్ పనులు వెంటనే చేపట్టడంపై ప్రభుత్వం సమీక్షించింది. గుండ్లకమ్మకు వరద పోటెత్తడంతో ముందస్తుగానే దిగు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. లక్ష క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామని ప్రకటించి లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందస్తు సమాచారం ఇచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే గండ్లు పడిన చెరువులు, కాలువల వద్ద వెంటనే పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు.ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ఉధృతి వస్తున్న నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులుసూచించారు. మున్నేరు వరద ఉధృతి అధికమవడంతో విజయవాడ-హైదరాబాద్ హైవేకి వరద చేరుతోందని ముందస్తుగానే అధికారులు అంచనా వేసి.. హైవేపైకి వరద చేరితే నల్గొండ వైపు వాహనాలు మళ్లించేలా చర్యలు తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొత్తూరు సమీపంలో శారదా నది ఉద్ధృతిలో చిక్కుకున్న భార్య, భర్త, ఇద్దరు పిల్లలను అధికారులు కాపాడేందుకు చర్యలు తీసుకున్నారు. కండలేరు రిజర్వాయర్ క్యాచ్‌మెంట్ ఏరియాలో మరింత వర్షం కురిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని గ్రహించి... గ్రామస్థులకు ఇబ్బంది లేకుండా 6 ప్రొక్లెయిన్లు పెట్టి పనులు చేయించారు. ఇలా అడుగడుగునా అప్రమత్తంగా ఉంటూ తుపాన్ వల్ల ప్రజలకు ఏ విధమైన నష్టం కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంది. అధికారులను మొదలుకొని ప్రజాప్రతినిధుల వరకు అంతా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు సేవలు అందజేశారు.

ప్రభుత్వ చర్యలతో సంగం బ్యారేజీకి తప్పిన పెను ముప్పు:
అధికారుల ముందస్తు చర్యలతో నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీకి భారీ ముప్పు తప్పింది. గత ఏడాది బుడమేరు వరదల సమయంలో ప్రకాశం బ్యారేజీ గేట్లకు వైసీపీ నాయకులకు చెందిన పడవలను అడ్డుపెట్టి ప్రభుత్వంపై భారీ కుట్రకు జగన్ తెరతీశాడు. తీరా అది వికటించి వైసీపీ మెడకే చుట్టుకుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి పడవలను తొలగించి వరద నివారణ చర్యలు చేపట్టింది. విజయవాడ వాసులను బుడమేరు వరదల నుంచి కాపాడింది. అలాంటి సంఘటనే నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీలో చోటుచేసుకుంది. మొంథా తుపాను వరద ఉధృతికి భారీ బోటు కొట్టుకొచ్చింది. వెంటనే స్పందించిన అధికారులు భారీ బోటును చాకచక్యంగా ఒడ్డుకు చేర్చారు.దాదాపు 30 టన్నుల బరువు ఉన్న బూటును శ్రమించి బయటికి తరలించారు. సంగం బ్యారేజీ ప్రమాదానికి గురికాకుండా చర్యలు తీసుకున్నారు. దాదాపు 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగం బ్యారేజీని పరిరక్షించారు.

వైసీపీ ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలకు గ్యారేటి లేదు:
2019- 24 మధ్యకాలంలో సంభవించిన విపత్తుల వల్ల కలిగిన నష్టం కన్నా... జగన్ మూర్ఖత్వపు ఆలోచలతో ప్రజలు పడ్డ ఇబ్బందులే ఎక్కువ. అక్రమ ఇసుక దోపిడీకి అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు తెరవకపోవడంతో 31 మంది పేద ప్రజల ప్రాణాలు వరదలో కలిసిపోయాయి. అన్నమయ్య ప్రాజెక్ట్ వరదలకు31 మందిని బలితీసుకోవడమే కాకుండా... ఆ పాపం అధికారుల వల్లే అంటూ సాక్షిలో తప్పుడు ప్రచారం చేయించారు. ప్రాజెక్ట్ కొట్టుకుపోవడం వల్ల చుట్టూ భూములన్ని ఇసుకమేటలతో దెబ్బతిన్నాయి. వ్యవసాయం లేకపోవడంతో కూలి పనులు కూడా చేసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 20 గ్రామాల ప్రజలు అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోవడం వల్ల జీవనోపాధి కోల్పోయారు.అలాగే2019 ఆగస్టు నుంచి సెప్టెంబర్ లో కురిసిన వర్షాలకు నంద్యాల, కర్నూలు జిల్లాల్లో సుమారు 23,087 కుటుంబాలు నిరాశ్రయులు అయ్యారు. 1057 ఇళ్లు దెబ్బతిన్నాయి. రూ.1,025 కోట్లు నష్టం వాటిల్లింది. 33 వేల హెక్టార్ల పంటలు దెబ్బతిన్నాయి. సెప్టెంబర్ 20న అప్పటి సీఎం జగన్ ఏరియల్ సర్వే చేసి నష్టపరిహారం ఇస్తామని చెప్పి పాత పద్దతిలో కూడా ఒక్కరూపాయి పరిహారం అందించలేదు. ఇలా ఐదేళ్ల పాలనలో జావద్, అసాని, మండూస్, నివర్, మోచా వంటి అనేక తుపానుల వల్ల రాష్ట్రంలోని రైతాంగం తీవ్రంగా నష్టపోయింది.దాదాపు 70 మంది దాకా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కానీ ఏ ఒక్కరికి సరైన పరిహారం అందజేయలేదు. కేవలం సమీక్షల పేరుతోనే సరిపెట్టేశారు. కుటుంబానికి రూ.2 వేల ఇస్తున్నట్టు ప్రకటించారు. కానీ వైసీపీ సానుభూతిపరులకే పరిహారం అందజేశారు. ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు కూడా జనాల్లో ఉండేందుకు ఇష్టపడలేదు. అకాల వర్షాలకు బాపట్ల జిల్లాలో పంట నష్టం వాటిల్లితే ప్రత్యేకమైన స్టేజ్ ఏర్పాటు చేసుకొని పరిశీలించారు. మరోచోట ఫోటో ఎగ్జిబీషన్ తిలకించి వెనుదిగిరి వచ్చేశాడు.
గతంలో రూ.2 వేలే... ఇప్పుడు రూ.3 వేలు:
విపత్తుల వేళ నిరాశ్రయులైన కుటుంబాలకు గత ప్రభుత్వంలో కేవలం రూ.2 వేలు ఇచ్చి మమ అనిపిస్తే... కూటమి ప్రభుత్వంలో ప్రతికుటుంబానికి రూ.3 వేల చొప్పున పరిహారం అందజేస్తుంది. దీంతో పాటు ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, మత్స్యకారులకు అయితే 50 కేజీల బియ్యం, కందిపప్పు కేజీ, లీటర్ వంట నూనె, కేజీ ఉల్లి, బంగాళదుంప కేజీ, పంచదార కేజీ చొప్పున నిర్వాసిత కుటుంబాలకు అందజేస్తోంది. నెలలు నిండిన 3,465 మంది గర్భిణులను ఆస్పత్రులకుచేర్చాం. వారికి పౌష్టికాహారం అందించాం. 1,906 తాత్కాలిక శిబిరాలకుసహాయ సామగ్రి పంపించాం. 14,798 పాఠశాలలకు సెలవులు ప్రకటించాం. 76 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. జగన్ పాలనలో కేవలం రూ.2 వేలు ఇచ్చి రెండు ఉల్లిపాయలు, నాలుగు టామోటలు అందజేసి విమర్శలు ఎదుర్కొన్నాడు. నేడు కూటమి ప్రభుత్వం జగన్ కన్నా రెట్టింపు సాయం నిర్వాసితులకు అందజేస్తుంటేదానిపై కూడా వైసీపీ దొంగల ముఠా విషయ ప్రచారం మొదలుపెట్టింది.

2014 లో వచ్చిన హుద్ హుద్ నుంచి 2018లో తిత్లీ, నేడు వచ్చిన మొంథా తుపాన్ వరకు రాష్ట్రానికి అపార నష్టం జరగకుండాకూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. జీరో క్యాజువాలిటీ లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగం పని చేసి చూపించింది. ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగాం. ప్రజలకు భరోసా కల్పించి ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇలా విపత్తును విజయవంతంగా ఎదుర్కొన్నారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను 24 గంటల్లోనే పునరుద్దరించారు. రహదారులు బాగు చేశారు. చెత్త చేదారం వెనువెంటనే శుభ్రం చేశారు.ఎన్నుకుంది మంచి ప్రభుత్వాన్నే అని... మా ఓటు వృథా కాలేదు అని ప్రజలు మాట్లాడుకునే విధంగా పరిపాలన చేసి చూపించారు.

- ప్రవీణ్ బోయ, అనలిస్ట్


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com