
స్ఫూర్తి ప్రదాత వనజీవి శ్రీ రామయ్య గారు
ఒకటి కాదు రెండు కాదు ఇప్పటి వరకూ కోటికి పైగా మొక్కలు నాటిన పుడమి పుత్రుడు శ్రీ దరిపెల్లి రామయ్య గారు. దాదాపుగా 60 సంవత్సరాల నుంచి నిస్వార్థంతో పెంచిన వన మెక్కలే తనని పద్మశ్రీ అందుకునేంతగా చేశాయి. తన నలుగురు మనువరాళ్లకు సైతం మొక్కల పేర్లు పెట్టాడంటే తనకు మొక్కల మీద ఎంత ప్రేమో తెలుస్తోంది. అటువంటి స్ఫూర్తిప్రదాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మంచిగా చెప్తూ, పర్యావరణం మీద తీసుకొనే శ్రద్ధ, జనసేన సిద్ధాంతాలలో పర్యావరణం పరిరక్షణకు ప్రాముఖ్యత ఇవ్వడాన్ని కొనియాడారు. ఇలాగే ముందుకు సాగాలని పర్యావరణం మీద ప్రజలకు మరింత అవగాహన వచ్చేలా ప్రేరేపించాలని పవన్ కళ్యాణ్ కు సూచించారు. పవన్ కళ్యాణ్ స్పందిస్తూ దీర్ఘాయుడిగా తన సేవలను కొనసాగాలని కోరుకున్నారు. వనజీవి రామయ్య గారి ఆశయాలను జనసేన పార్టీ మరింత ముందుకు తీసుకెళ్లెలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. డొక్కా సీతమ్మ పేరు మీద ఆహార శిబిరాలు ఎలా ఏర్పాటు చేశామో అలాగే, వనజీవి రామయ్య గారి పేరు మీద పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుపై అవగాహన కల్పిస్తామని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు.