వేమూరు ( జనస్వరం) : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన నాలుగున్నర ఏళ్లలో కాపులకు తీరని అన్యాయం జరిగిందని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సోమ రౌతు అనురాధ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని కుచ్చళ్ళ పాడు గ్రామంలో పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడుతూ అధికార పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డికి ఊడిగించేస్తున్న అంబటి రాంబాబు, పేర్ని నాని లు జనసేన అధినేత పై విమర్శలు చేస్తూ, మేము కాపుల మంటూ గుండెలు బాదుకుంటున్నారని ఇన్నాళ్లు గుర్తుకురాని కాపులు, మీకు ఇప్పుడు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారే కానీ దాని ద్వారా ఏమైనా జరిగిందా, విధమైన సంక్షేమ పథకాల అందయ్య అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో, కాపు కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్య పథకం అమలు అయిందని, హాఫ్ కార్పొరేషన్ రుణాల అందాయని, నేడు ఆ పథకాలు అమలు కానప్పటికీ దాని గురించి మీరు ప్రశ్నించారా అని అనురాధ ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చేనాటికి, మేము కాపులమేనంటూ, జగన్మోహన్ రెడ్డి గూడెం చేస్తూ, పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో, ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అధిష్టానం తీసుకున్న పొత్తు నిర్ణయాన్ని ప్రజలకు వివరిస్తూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దించేంతవరకు పోరాటం చేయాలని తెలియజేశారు. సమావేశంలో పార్టీ నాయకులు బీసీ నాయకులు వాసుదేవ గౌడ్ సోమరత్ బ్రహ్మం, తాడికొండ నాగరాజు, పరిస నాగబాబు గౌడ్, గాజుల శ్రీను, కోటేశ్వరరావు, సుమన్ నాయుడు, సోమ రౌతు నవీన్ భాస్కర్, ఎలీషా తదితరులు ఉన్నారు.