Logo
Date of Publish : 28 January 2024, 9:09 pm
Editor : Sake Naresh

వైసీపీ పాలనలో అన్ని వర్గాలకి అన్యాయమే : కోన తాతారావు

   గాజువాక ( జనస్వరం ) : జనసేన పార్టీ PAC సభ్యులు, గాజువాక నియోజకవర్గం ఇంచార్జి కోన తాతారావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు కేంద్రం ప్రయత్నం చేస్తుంటే.. అడ్డుకోవాల్సిన సీఎం జగన్ అడ్డుకొనే ప్రయత్నం చేయకుండా తన సొంత ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వంకు వత్తాసు పలుకుతున్నాడు. ప్రైవేటికరణ ముసుగులో స్టీల్ ప్లాంట్ మిగులు భూములు ఆదానికి ఇచ్చేందుకు జగన్ కృషి చేయటం దారుణమన్నారు. గంగవరం పోర్టు ప్రభుత్వ రంగంలో వుంటే ఉపాధి వస్తుందని మత్సకారులు, ఉక్కు నిర్వసితులు భూములిస్తే.. 2400 కోట్లు రూపాయలు విలువ చేసే పోర్టు ను, ప్రభుత్వం ఆస్తులను కేవలం 560 కోట్లకు అమ్మేసి వేల కోట్లు తన జేబులో వేసుకున్నారన్నారు. ఉపాధికొరకు రాష్ట్ర నలుమూలల నుంచి గాజువాక వచ్చి అద్దై ఇళ్లలోను, కొండల మీద షెడ్డులలోని దశాబ్దాలు తరబడి మగ్గిపోతుంటే వైసిపి ప్రభుత్వం వారికి 100 గజాలు స్థలం ఇవ్వటానికి చేతులు రావు.. కానీ వైసిపి పెద్దలు, అనుచరులకు ఎకరాలల్లో అప్పనంగా కేటాయయించటమో లేక ఆక్రమించటానికి సహకరించటాన్ని నిరసిస్తున్నామన్నారు.  వైసిపి పాలనలో కొత్తగా ఒక్క పరిశ్రమ రాక పారిశ్రామిక ప్రాంతములో ఉన్న యువత నిరుద్యోగంతో వలస పోవటం లాంటి సమస్యలపై స్పందిస్తూ.. ఈ రోజు భారీ బైక్ ర్యాలీ ద్వారా ప్రజలు వద్దకు జనసేన శ్రేణులు వెళ్ళటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టి నాయుకులు గడసాల అప్పారావు, దల్లి గోవిందరెడ్డి, తిప్పల వెంకటరమణారెడ్డి, వివిధ వార్డుల అధ్యక్షులు కరణం కనకారావు,కోన చిన అప్పారావు,ముమ్మన మురళి, రౌతు గోవింద రావు,లంకల మురళీ దేవి, గొలగాని గోపీచంద్, పోలరౌత్ వెంకటరమణ, చోడిపిల్లి ముసలయ్య, సంద్రాన భాస్కర్, మాకా షాలిని, జ్యోతి రెడ్డి, కాద శ్రీను, మెడిశెట్టి విజయ్, గవర సోమశేఖర్, చైతన్య, బలిరెడ్డి నాగేశ్వరావు, దుల్ల రామనాయుడు, సిరిసపల్లి కనకరాజు, చందక చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com