మార్కాపురం ( జనస్వరం ) : మార్కాపురం జిల్లా సాధనకై తర్లుపాడు మండలం కేంద్రంలో జనసేన పార్టీ నిరాహార దీక్షను ప్రారంభించారు. జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ మరియు మార్కాపురం జిల్లా సాధన సమితి JAC వైస్ చైర్మన్ ఇమ్మడి కాశీనాథ్ ఆధ్వర్యంలో తర్లుపాడు జనసేన మండల అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు, జనసేన ఉపాధ్యక్షులు సూరే సువర్ణ, వీర మహిళలు జనసైనికులు అందరూ పశ్చిమ ప్రకాశం జిల్లా చేయాలని ఒక్క రోజు నిరాహార దీక్ష చేశారు. ముగింపు కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి N.v. సురేష్ బాబు వారికి నిమ్మకాయ నీళ్లు ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం ఎమ్మార్వో గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com