విజయనగరం ( జనస్వరం ) : వైఎస్ఆర్ నగర్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలని జనసేన నేత గురాన అయ్యలు కోరారు...ఈమేరకు సోమవారం స్పందనలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ విజయనగరం పట్టణ పరిధిలో వైఎస్ఆర్ నగర్ ఏర్పడి 14 సంవత్సరాలు అవుతున్నా ,మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. సుమారు 2500 నివాస గృహాలను కలిగి ఉన్న వైఎస్ఆర్ నగర్ లో కాలువలు, రోడ్లతోపాటు రక్షిత మంచి నీటి కోసం ట్యాంకు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వీధి దీపాలు కూడా అంతంత మాత్రంగానే వున్నాయన్నారు. మురుగు నీరు రోడ్లపై నిల్వవుండడంతో పందులు, దోమలు కారణంగా ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నారన్నారు. పలుమార్లు సమస్యల పరిష్కారం కోసం అధికారులకు వినతిని అందించామని, అయినా పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు పిడుగు సతీష్ , టి.రామకృష్ణ,
కాటం అశ్విని, పితాల లక్ష్మీ, ఏంటి రాజేష్, ఎల్ .రవితేజ, అడబాల వేంకటేష్, దుప్పాడ నరేష్, ఎమ్ .పవన్ కుమార్, పృథ్వీ భార్గవ్, కె.సాయి, కంది సురేష్ కుమార్, మధు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com