కోవిడ్ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలి:జనసేన డిమాండ్
కరోన తీవ్రత పెరుతున్నందున కోవిడ్ ఆసుపత్రులు పెంచడంతో పాటు, మౌలిక సదుపాయాలు కల్పించాలని జనసేన పార్వతీపురం ఇంచార్జ్ జి. గౌరీశంకర్ డిమాండ్ చేశారు. సోమవారం సీతానగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్వతీపురం డివిజనులో కొత్తగా ఉల్లిభద్రలో ఏర్పాటుచేసిన కోవిడ్ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలులేక, సరైన వైద్య సదుపాయాలులేక రోగులఆవేదనను అధికారులు గమనించాలని విజ్ఞప్తి చేసారు. కరోన పేరిట ప్రైవేటు ఆసుపత్రిలలో జరుగుతున్న దోపిడీని ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఆరోగ్యశ్రీ క్రింద కరోనాను చేర్చి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. దీంతోపాటు అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతీరోజు కరోనా పరీక్షలు నిర్వహించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వైద్యులకు, వైద్యసిబ్బంది అందరికి తప్పనిసరిగా పీపీఈ కిట్లుఅందజేయాలని కోరారు. కరోనాపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అన్ని గ్రామాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కరోనాతోపాటు సీజనల్ వ్యాధులపై కూడా అధికారులు దృష్టి సారించాలని కోరారు. ఇదిలావుండగా సీతానగరం వంతెన మరమ్మతులు ఇటీవలే చేసినప్పటికీ, వంతెనపైకొత్తగా ఏర్పాటు చేసిన గడ్డరు ఒకటి అకస్మాత్తుగా క్రిందపడి పెను ప్రమాదం తప్పిందని, దీనికి సంబంధించిన అధికారులు సరైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పనుల్లో నాణ్యత లేదని స్పష్టంగా తెలుస్తోందన్నారు. లచ్చయ్యపేట ఎన్.సి. స్ చక్కెరకర్మాగారంలో రైతులకు 10కోట్ల చెరకుబకాయిలు ఇంతవరకు చెల్లింపు చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని చెప్పారు. తక్షణమే రైతుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం ఇంచార్జ్ జి. గౌరీశంకర్ డిమాండ్ మరియు నియోజకవర్గ నాయకులు రెడ్డి కరుణ, చందక అనిల్, సీతానగరం మండలజనసేన నాయకుడు పోతల శివశంకర్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com