
నర్సింగపల్లిలో మౌలిక సదుపాయాలు కల్పించండి : టెక్కలి జనసైనికులు
టెక్కలి నియోజకవర్గం నర్సింగపల్లి పంచాయతీ సమస్యలపై ఎంపిడిఓ కార్యాలయంలో పరిపాలన అధికారి హెచ్ వీ రమణమూర్తికి గురువారం జనసేన పార్టీ నాయకులు కూరాకుల యాదవ్, అట్టాడ శ్రీధర్ లు వినతిపత్రం అందజేశారు. టెక్కలి మండలం నర్సింగపల్లి పంచాయితీ నందు ఎస్సి కాలనీలో నివసిస్తున్న అనేక కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోక ఇబ్బంద్దులకు గురవుతున్నాయి. త్రాగు నీటి సదుపాయాలు లేక ప్రజలు అల్లాడుతున్నారు. గ్రామంలో పారిశుధ్య నిర్లక్ష్యం వలన అనేక వ్యాధులు ప్రబలుతున్నాయి. డ్రైనేజిలు లేక ఇళ్లలోని మురికి నీరు వీధుల్లోకి వ్యాపించి నిల్వ ఉండిపోవడంతో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి.
గ్రామ పెద్దలు పలుమార్లు ఈ సమస్యలపై గ్రామ అధికారుల వద్ద మొర పెట్టుకున్నా పట్టించు కోవటం లేదని వాపోతున్నారు. ఈ సమస్య పై ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరపున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పసుపు రెడ్డి సోమేశ్, రాయి సునీల్, బొడ్డేపల్లి వెంకటేష్, సంజు రెడ్డి, తోట శ్యామ్, వాకాడ క్రిష్ణ, హనుమంతు దిలిప్ తదితరులు పాల్గొన్నారు..