Logo
Date of Publish : 05 December 2020, 10:15 am
Editor : Sake Naresh

పెంచిన గ్యాస్​ సిలిండర్​ ధరలు వెంటనే ఉపసంహరించుకోవాలి జనసేన వీరమహిళ కొలసాని లక్ష్మీ డిమాండ్

పెంచిన గ్యాస్​ సిలిండర్​ ధరలు వెంటనే ఉపసంహరించుకోవాలి జనసేన వీరమహిళ కొలసాని లక్ష్మీ డిమాండ్

                     పెంచిన గ్యాస్​ సిలిండర్​ ధరలను వెంటనే చమురు మార్కెటింగ్​ సంస్థలు ఉపసంహరించుకోవాలని ప్రకాశంజిల్లా పర్చూరు నియోజకవర్గ జనసేనపార్టీ వీరమహిళ కొలసాని లక్ష్మీ శనివారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చమురు మార్కెటింగ్​ సంస్థలు రాయితీ గ్యాస్​ సిలిండర్​ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం మూలిగే నక్కపై తాటిపండు పడ్డచందంగా ఉందన్నారు. అసలే కరోనా విపత్కాలంలో పనులు లేక కుటుంబ పోషణ కష్టతరంగా మారిన సామాన్య ప్రజలపై వంటగ్యాస్​ కంపెనీలు కనికరంలేకుండా వినియోగదారులైన సామాన్యులపై భారం మోపడం భావ్యమా?? అని ఆమె ప్రశ్నించారు. ​ఒక్కో గ్యాస్​ సిలిండర్​పై రూ.50 పెంచుతున్నట్లు ప్రకటించాయని తెలిపారు. పర్చూరు నియోజక వర్గంలో ఇదివరకు ఒక్కో సిలిండర్ ధర 639రూపాయలు ఉండగా...పెరిగిన ధరలు మూలంగా 689 రూపాయలు అయ్యిందన్నారు. దీంతో పాటు రవాణా ఖర్చులు అదనంగా వసూలు చేస్తారని ఆమె వాపోయారు. పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని గ్యాస్ కంపెనీలు వెల్లడించాయన్నారు. చమురు మార్కెటింగ్​ సంస్థలు తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో సామాన్య వినియోగదారులపై మరింత భారం పడనుందని కొలసాని లక్ష్మీ ఆవేదన వ్యక్తంచేశారు.. ఈ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకొని సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలా జరగని పక్షంలో సామాన్య మహిళలందరూ సంఘటితమై ధరలు తగ్గించే వరకు ఉద్యమించి పోరాటం చేస్తామని కొలసాని లక్ష్మీ హెచ్చరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com