Logo
Date of Publish : 02 March 2026, 11:26 am
Editor : Sake Naresh

బ్రెయిన్ స్ట్రోక్ బాధితుడికి ఇన్ఫినిటీ ట్రస్ట్ ఆర్థిక సాయం

కళ్యాణదుర్గం, ఫిబ్రవరి 24, (జనస్వరం) : ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ మరోసారి తన సేవాభావాన్ని చాటుకుంది. కంబదూరు మండలం పి.వెంకటాంపల్లి గ్రామానికి చెందిన కరియప్ప ఆరు నెలల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై అనంతపురంలోని సన్‌రే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఆస్తులు అమ్మి, అప్పులు చేసి చికిత్స చేయించడంతో కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావాలంటే చెల్లించాల్సిన రూ.34,780 బకాయిలను తీర్చలేని స్థితిలో కుటుంబ సభ్యులు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్‌ను ఆశ్రయించారు. కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ వెంటనే స్పందించి ఆసుపత్రి యాజమాన్యం పేరున రూ.34,780 చెక్కును అందజేశారు. దీంతో బకాయిలు క్లియర్ చేసి కరియప్పను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి సురక్షితంగా ఇంటికి పంపించారు. కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ సురేష్ కుమార్, కార్యదర్శి హరీష్, అబ్దుల్ వాహబ్, తిప్పేస్వామి, మహేష్, రాము, ఓబులేష్, రామాంజినేయులు పాల్గొన్నారు. తమ కష్టకాలంలో అండగా నిలిచిన ట్రస్ట్ సభ్యులకు కరియప్ప కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com