Logo
Date of Publish : 13 January 2023, 3:38 pm
Editor : Sake Naresh

పనికిమాలిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఆత్మపరిశీలన చేసుకోవాలి : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

         నెల్లూరు సిటీ ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 242వ రోజున 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ మూడు జెండాలు సెంటర్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నిన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉత్తరాంధ్ర సమస్యల గళాన్ని వినిపించే యువశక్తి కార్యక్రమం ఘన విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉందని, ఆ భారీ బహిరంగసభకు హాజరైన అశేష జనవాహిని, ప్రజా ఆదరణ అధికార వైసీపీ ఆగడాలకు చెంపపెట్టు అని అన్నారు. మూడేళ్ళ తమ పదవీ కాలంలో కనీస అభివృద్ధి కూడా చేయలేని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు అభద్రతాభావంతో పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. మాజీమంత్రి పేర్ని నాని కాపు కులం కార్డు వాడుకుంటూ పవన్ కళ్యాణ్ గారిపై పిచ్చి ప్రేలాపణలు చేస్తున్నారని, ఇకమీదట కూడా కాని కొనసాగితే కాపుల చేతిలోనే దెబ్బలు తినే పరిస్థితి వస్తుందని అన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎమ్మెల్యే, మంత్రులుగా చేసిన తన తండ్రి, తాతల గురించి మాట్లాడుతున్నారని, వారినే అడిగి అసలు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉంటే బాధ్యతలు ఎలా ఉంటాయో, పోర్ట్ ఫోలియో ఎలా ఉంటుందో తెలుసుకోవాలని, ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా అనుభవిస్తున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎదురవబోతున్న ఘోర ఓటమిని తలచుకునే అభద్రతాభావంలోకి వీరు వెళ్లిపోయారని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com