Logo
Date of Publish : 11 April 2023, 5:08 pm
Editor : Sake Naresh

దివ్యాంగులకు పెన్షన్ ఇవ్వలేని పనికిమాలిన ప్రభుత్వం : పోతిన మహేష్

          విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వo కార్యక్రమం 53వ డివిజన్ అధ్యక్షులు పొట్నూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సైకం వారి వీధి వద్దనుండి ప్రారంభించి సైకం వారి వీధి లో పర్యటించడం జరిగింది. మీడియా పాయింట్ వద్ద పోతిన మహేష్ మాట్లాడుతూ ఇంటింటికి జనసేన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రజలందరూ కూడా తమ సమస్యలను చెప్పుకుంటున్నారని ముక్యంగా ఈ డివిజన్లో ఒక దివ్యంగుడు గతంలో టాక్స్ పే చేసినందువల్ల పెన్షన్ తొలగించారని స్థానిక కార్పొరేటర్ అయిన అప్పాజీకు, ఎమ్మెల్యేను పలుమార్లు కలిసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారని, జగన్ మోహన్ రెడ్డి కోడి కత్తి కేసులో కోర్టుకి హాజరైతే ట్రాఫిక్ సమస్యలు వస్తాయని అందుకే కోర్టుకు హాజరు కానని కుంటి సాకులు చెప్పుకొస్తున్నారని, అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తే అది పరదాల చాటున బారికేడ్లు మాటున సాగుతున్నాయని, ఆయన సభలు పెడితే ప్రజలందరూ గోడలు దూకి పారిపోతున్నారని, అసలు ఆయన పర్యటనకు వస్తే ఎక్కడా కూడా ట్రాఫిక్ జామ్ అయిన దాఖలాలు లేవని, కానీ కోర్టుకు వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుందని, కామెడీ డైలాగులు చెప్తున్నారని, అదేవిధంగా జడ్జిగారు కూడా ఇట్లాంటి కారణాలును చూపిస్తే ఉపేక్షించకుండా జగన్మోహన్ రెడ్డిని కోడి కత్తి కేసులో కచ్చితంగా హాజరు కావాలని ప్రజలకు తెలుస్తాయని, విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో ఎందుకు జగన్ మోహన్ రెడ్డి స్పందించడం లేదని కనీసం నోరు మెదపడం లేదని, తెలంగాణ సీఎం కేసీఆర్ ఉక్కు కర్మాగారం కొనుగోలు చేస్తానన్నా సీఎం జగన్ స్పందించడం లేదంటే జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీలు బిఆర్ఎస్ పార్టీ ఇచ్చే ప్యాకేజీ కి అమ్ముడుపోయినట్టేనని మరియు విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటికరణ పై కేంద్రప్రభుత్వాన్ని మీరు నిలదీయడం లేదంటే మీ మీద ఉన్న సిబిఐ కేసులకి ఈడి కేసులకి, అవినాష్ రెడ్డి పై ఉన్న కేసులకి మీరు లొంగిపోయారని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఆదాని కి అమ్మిన కెసిఆర్కి అమ్మిన ఊరుకునేది లేదని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మైనార్టీల ద్రోహి అని గాలిబ్ షా దర్గా స్థలాలు అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి అనేక వేల కోట్ల రూపాయల వీఎంసీ ఆదాయానికి గండి కొడుతున్నా కనీసం. స్పందించడం లేదంటే అక్రమాలన్నీ స్థానిక ఎమ్మెల్యే కనుసనల్లోనే జరుగుతున్నాయని ప్రజలకు అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు రేకపల్లి శ్రీనివాసరావు, మోహన్ రావు, అడ్డగిరి పుల్లారావు, బొట్టు రవికుమార్ డివిజన్ అధ్యక్షులు నారాయణపు స్వామి ప్రదీప్ రాజ్, ఆకుల రవిశంకర్, రెడ్డిపల్లి గంగాధర్, కొరగంజి వెంకటరమణ, బత్తుల వెంకటేష్, సిగానంశెట్టి రాము, మల్లెపు విజయలక్ష్మి , తిరుపతి అనూష, తమ్మిన లీలా కరుణాకర్, ఏలూరు సాయి శరత్, బోమ్ము రాంబాబు, వెన్న శివశంకర్ , స్టాలిన్ శంకర్, బోట్టా సాయి, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com