Logo
Date of Publish : 27 December 2023, 11:31 pm
Editor : Sake Naresh

జనసేనను గెలిపిస్తే నెల్లిమర్ల నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధి

  నెల్లిమర్ల ( జనస్వరం ) :  వచ్చే ఎన్నికల లో జనసేన పార్టీని, తననూ ఆదరించాలని నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి లోకం మాధవి గారు ప్రజలను అభ్యర్ధించారు. నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటిరేగ, ఎస్సీ కాలనీలో ఇంటిఇంటికి జనసేన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకం మాధవి గారు మాట్లాడుతూ మండల హెడ్ క్వార్టర్స్ పిలవబడుతున్న ఈ ప్రాంతం చాలా వెనకబడి ఉంది అని కనీస మౌలిక సదుపాయాలు కరువు అయ్యాయని ఎద్దేవా చేశారు. అలాగే పథకాల ధృవీకరణ లోనూ సమస్య వస్తోంది అని అక్కడి ప్రజలు విన్నవించుకున్నారు . వచ్చే ఎన్నికలలో తనకు పట్టం కడితే సుస్థిర పాలన అందిస్తామని చెప్పారు. నెల్లిమర్ల నియోకవర్గంలోని యువతకు ఉద్యోగ కల్పన చేయడంతో పాటు, సంక్షేమానికి కూడా పెద్దపీట వేయనున్నట్లు చెప్పారు. అవినీతి రహిత పాలన జనసేనకే సాధ్యమన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు లోకం మాధవి వారి సమస్యలు విన్నవించుకున్నారు. కాలనీలో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉందని,వీధి దీపాలు లేక , సరైన రోడ్లు లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అని, తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. అలాగే ఈ వై.సీ.పీ పాలనతో తాము విసుగు చెందామని వచ్చే ఎన్నికలలో నియోజకవర్గం లో మీకు ఓటు వేసి తద్వారా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్య మంత్రిగా చేసుకుంటామని తెలియచేశారు. వారి మాటలకు స్పందిస్తూ లోకం మాధవి గారు ముందు మీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించమమని కొరతాం అని,పరిష్కారం అవ్వని యెడల తాము అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్యకారి కార్యదర్శి కే అప్పలరాజు జనసేన పార్టీ సీనియర్ నాయకులు గుడివాడ జమరాజు, సంతోష్ కుమార్, గుడివాడ శేఖర్, మాదే టి ఈశ్వరరావు, బోర సతీష్, కిల్లారి రమేష్, బి నర్సింగరావు, కోట రాజారావు, బి సత్య కీర్తి, బి అప్పలరాజు, బి సాయి, రామచంద్ర, భగవాన్, శివతేజ, జగదీష్, కృష్ణమూర్తి, తోటరాజు, పైడిరాజు, జగదీష్ మరియు ఇతర జన సైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com