Logo
Date of Publish : 26 January 2023, 3:39 pm
Editor : Sake Naresh

భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి బలమైనది : ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు

            ఏలూరు, (జనస్వరం) : భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి బలమైనదని జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నారు.ఏలూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయం లో 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ అధ్యక్షత వహించారు..ముందుగా జనసేన పార్టీ నాయకులు రాఘవయ్య చౌదరి గారు, మాజీ ఎమ్మార్వో గుబ్బల నాగేశ్వరరావు గారు బి.ఆర్.అంబేద్కర్, మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. అనంతరం రెడ్డి అప్పల నాయుడు జెండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ బి.ఆర్. అంబేద్కర్ సారధ్యంలో భారత దేశ రాజ్యాంగ నిర్మాణంలో ప్రపంచంలోనే అతి బలమైన రాజ్యాంగాన్ని నిర్మించి ఆరోజు ఉన్న పరిస్థితులకు అనుకూలంగా విభిన్నమైన ఒక చట్టం దుర్మార్గమైన ప్రభుత్వాలు ముఖ్య మంత్రులు లేదా కేంద్ర ప్రభుత్వం లో ఉన్నటువంటి వారు ఆ చట్టాలను కాలరాస్తు బలమైన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ పాలకులు వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారని అన్నారు. తెల్లదొరల పాలన నుండి విముక్తి పొంది, దేశానికి స్వాతంత్య్రం వచ్చిందనే భ్రమలో ఈ దేశ ప్రజలు జీవిస్తున్నారు.. కానీ నేడు దేశంలోడా.బి.ఆర్.అంబేద్కర్ రాసిన రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ నేటి నల్లజాతి పాలకులు నియంత పాలన అందిస్తున్నారు..ఒక ప్రక్కన ప్రజా సమస్యల మీద అవగాహన చేసుకొనే ప్రతిపక్షాలకు హక్కుని లేకుండా చేయడం దానికి అనుగుణంగా జీవో నెం.1నీ తీసుకురావడం సరైన విధానం కాదని ప్రభుత్వం పై రెడ్డి అప్పల నాయుడు మండిపడ్డారు.ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, ప్రజల హక్కు కాలరాస్తు ప్రజల సంపదను కొల్లగొడుతూ వారి స్వేచ్ఛ స్వాతంత్రం లేనటువంటి పరిస్థితి ని తీసుకొస్తున్నారన్నారు. ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు, మేధావి వర్గాలు నాయకులు విద్యార్థులు న్యాయవ్యవస్థ గాని రాజ్యాంగం గురించి మాట్లాడే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్ర ప్రజానీకానికి జనసేన పార్టీ తరఫున జన సైనికులకు వీర మహిళలకు మెగా అభిమానులకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలకు మరో పోరాటంలో ప్రజలందరూ సిద్ధం కావాలని భారత రాజ్యాంగాన్ని బి.ఆర్. అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకొని ఈ సంపదను ప్రజలకు అందే విధంగా మనం నిరంతరం పోరాటానికి సిద్ధం కావాలని అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ గుప్తా,ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్,పల్లి విజయ్, కోశాధికారి పైడి లక్ష్మణరావు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు,ఎట్రించి ధర్మేంద్ర, బొత్స మధు,కూర్మా సరళ, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి,వీర మహిళలు తుమ్మపాలఉమాదుర్గ,కోలా సుజాత,గన్నవరపు ప్రియా రాణి, దుర్గా బి. తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com