Logo
Date of Publish : 04 July 2022, 4:56 pm
Editor : Sake Naresh

పెంచిన ఆర్టీసీ చార్జీలను తగ్గించాలి : ఎమ్మిగనూరు జనసేన నాయకులు

    ఎమ్మిగనూరు, (జనస్వరం) : ఎమ్మిగనూరు జనసేన పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి కాసా రవి ప్రకాష్, లు మాట్లాడుతూ పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు కొన్ని నెల్లల వ్యవధిలోనే ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్యుడిపై అధిక భారాన్ని మోపిన ఘనత రాష్ట్ర ప్రభుత్వాన్నిదే అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లును తగ్గిస్తుంటే ఒకవైపు డీజిల్ పెట్రోల్ రేట్లును తగ్గించకుండా ఆర్టీసీ చార్జీలను పెంచడం ఏంటి అని ప్రశ్నించారు. సమయం సందర్భం లేకుండా ఆర్టీసీ చార్జీలు పెంచడం ఏమాత్రం సమంజసం కాదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రయాణికున్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ చార్జీలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వినయ్, షబ్బీర్, వెంకటేష్, ఉరుకుందు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com