కదిరి, (జనస్వరం) : ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఆధార్ కార్డు లింక్ అప్ చేయుటకు వేలిముద్రలు వేయాలని, ఈ నెలాఖరు వరకు గడువు ఇవ్వడం, వేయించుకొని వారికి వచ్చే నెల నుంచి రేషన్ మరియు పింఛన్లు రద్దు చేస్తామని అని చెప్పడం దారుణం అని జనసేన పార్టీ ఇంఛార్జ్ భైరవ ప్రసాద్ గారు తెలియజేశారు. అనంతపురం జిల్లాలో కేవలం 130 సెంటర్లో మాత్రమే పెట్టి అది ఈ నెలాఖరు వరకు గడువు ఇవ్వడం చాలా దారుణమని, సెంటర్లు పెంచి, గడువును కూడా పెంచాలని జనసేన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నామని లేనియెడల లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతారని తెలియజేశారు. చాలామంది వృద్ధులు, పిల్లలు ఆధార్ కార్డు లేని వారు చాలామంది ఉన్నారని వారందరినీ వాలంటీర్ల ద్వారా గుర్తించి వారికి వృద్ధాప్య పింఛన్లు, రేషన్ ఇవ్వాలని వారు కోరారు. అలాగే ఆధార్ సెంటర్ నందు సేకరణ సమయంలో చాలా పెద్ద సంఖ్యలో రాత్రి వేళల్లో కూడా ప్రజలు బారులు తీరి ఉన్నారని, వాటిని సెంటర్లో పెంచి గడువిస్తే మంచిదని తెలియజేశారు. ఆధార్ లింక్ అప్ కానీ వారికి రేషన్, పింఛన్లు ఇవ్వమని చెప్పడం ప్రజలను మోసం చేయడమే అవుతుంది అని అని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంజి బాబు లక్ష్మణ్ తదితురులు పాల్గొన్నారు.