నెల్లూరు ( జనస్వరం ) : దాదాపుగా పూర్తయిన పోతిరెడ్డి పాలెం కరకట్టకి 12 కోట్లు కాంట్రాక్టు పెండింగ్ ఉండటంలో పనులు పొందుకు సాగడం లేదని జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ పెన్నా నదీ గర్భ ప్రాంతాలన్నీ ఇసుక మట్టి తవ్వకాలకు గురై నది కోతకు గురవుతుంది. పెన్నా నది గర్భ ప్రాంతాల లో అక్రమ ఇసుక,మట్టి తవ్వకాలు ఎక్కువై పరివాహక ప్రాంతాలు కోతకు గురై నదులు గ్రామాల పైనబడుతున్నాయి. రానున్న రోజుల్లో వరదలు సంభవిస్తే కచ్చితంగా గ్రామాలకు ముంపు కు గురయ్యే పరిస్థితి ఉంది. నెల్లూరు బ్యారేజ్ పూర్తయినప్పటికీ చుట్టుపక్కల రివాల్టు వాలు ఇంకా నత్తనడకన సాగుతున్నందున నవంబర్ నెలలో ప్రతి ఏటా వచ్చే వరదల వల్ల సంతపేట,రంగనాయకులపేట వాస్తవ్యులకు ఇంకా వరద ముంపు గురయ్యే ప్రమాదం. ముంపు ప్రాంతాల వాసులందరినీ గుర్తించి పునరావసం ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇస్తామని గొప్పలు చెప్పుకుంటుందే కానీ ఇచ్చిన పాపాన పోలేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిర్వహించవలసిన సమావేశాలు.. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాల నుంచి జరగలేదు.. ఇరిగేషన్ స్థలాలు అక్రమ తవ్వకాలు గురైనా,ఆక్రమణలకు గురైనా వారిలో ఎటువంటి చలనం లేదు. ఏటా రాబోయే వరదల గురించి పెన్నా నది నుంచి పొలాలకు అందాల్సిన నీరు గురించి మీటింగ్లు గట్రా ఏమి జరగడం లేదు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే సహజ వనరులను కాపాడుకుంటాం… జిల్లా వాసులు వరప్రదాయని పెన్నానది తీర ప్రాంతాలను కాపాడుకుంటామని అన్నారు.