నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ, 15 వ డివిజన్, బాలాజీ నగర్ ప్రాంతానికి చెందిన ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ ఖాదర్ బాషా గారు మరియు స్థానిక మైనారిటీ యువత 50 మంది కలసి జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. స్థానిక అన్నపూర్ణ అపార్టుమెంట్ సమీపంలో జరిగిన చేరికల కార్యక్రమంలో కేతంరెడ్డి గారు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారు మాట్లాడుతూ కులాలను మతాలను కలుపుకుని పోవడం అనే జనసేన పార్టీ సిద్ధాంతాన్ని మెచ్చి మైనారిటీ యువత పార్టీలో చేరడం జరిగిందన్నారు. జనసేన పార్టీలో పాలిట్ బ్యూరో నుండి అనేక పదవుల్లో ముస్లింలకు పెద్ద పీట వేయడం జరిగిందన్నారు. తమ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ముస్లిం మైనార్టీలంటే ఎనలేని ప్రేమాభిమానాలు ఉన్నాయన్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండన్న జగన్ రెడ్డి గారికి అందరూ అండగా నిలబడి ఛాన్స్ ఇచ్చాక జరుగుతున్న ప్రభుత్వ పరిపాలన తీరుని ప్రజలు తట్టుకోలేకపోతున్నారని, ప్రజాధనాన్ని పప్పు బెల్లాలు పంచినట్లు పంచి వృథా చేస్తూ, ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి, పథకాలకు డబ్బులు సర్దడానికి చెత్తకి కూడా పన్నులు వేసే పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2024లో వేరే ప్రత్యామ్నాయం లేదని, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరి ఆశీస్సులతో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారన్నారు. నెల్లూరు సిటీలో గతమెంతో వైభవంగా ఉన్న ముస్లిం మైనారిటీల పరిస్థితి ప్రస్తుతం ఓటు బ్యాంకు రాజకీయంగా మారిపోయిందని, మైనారిటీలలోనే వర్గాలను సృష్టించి వైసీపీ నాయకులు అభివృద్ధి అనేదే లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన నామినేటడ్ పదవుల్లో కూడా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అయిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముస్లిం మైనారిటీలకు అన్యాయం చేసారని తెలిపారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాలకు సమాన న్యాయం జరుగుతుందని ఆ దిశగా అందరం కృషి చేద్దామని నూతనంగా చేరిన మైనారిటీ సోదరులను కేతంరెడ్డి గారు కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, శ్రీను ముదిరాజ్, మోష, శ్రీకాంత్ యాదవ్, గణేష్, హేమంత్ రాయల్, ముస్లిం మైనారిటీ యువత ఖాలేషా, రబ్బాని, గయాజ్, జహీర్ తదితరులు పాల్గొన్నారు.