శేరిలింగంపల్లి ( జనస్వరం ) : శేరిలింగంపల్లి జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు జనసేన పార్టీ కిట్లను అందించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ శేరిలింగంపల్లి ఇంచార్జ్ డాక్టర్ మాధవ రెడ్డి మాట్లాడుతూ జనసేన సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు. రానున్న రోజుల్లో తెలంగాణలో సైతం జరగనున్న సామాజిక తెలంగాణ నిర్మాణంలో మీ పాత్ర కీలకంగా ఉండబోతుందని, అందుకు మీరు సంసిద్ధులై ఉండాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈరోజు మనం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న మిత్రులకి జనసేన పార్టీ కిట్లను అందించడం జరిగింది. ఆ కిట్లలో ఏదైతే ఉందో ఈ రోజు వరకు దేశంలో ఏ రాజకీయ పార్టీ సైతం కార్యకర్తల గురించి ఆలోచించింది లేదన్నారు. కానీ మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల జీవితాలను దృష్టిలో ఉంచుకొని ఐదు లక్షల జీవితా భీమా, అదేవిధంగా కార్యకర్తలు సమాజంలో తోటి వాళ్లను నిర్మాణం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారి సందేశాన్ని అదేవిధంగా జనసేన పార్టీ గాజు గ్లాసు తంబ్లర్ గుర్తు లను అందించడం జరిగింది.
విధంగా శేరిలింగంపల్లి లో సైతం కార్యకర్తలకు ఎల్లప్పుడూ జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అదేవిధంగా రానున్న రోజుల్లో శేర్లింగంపల్లిలో జనసేన పార్టీ క్రియాశీలక పాత్ర పోషించబోతుందని, రానున్న ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా శేర్లింగంపల్లి ప్రజలు జనసేన వైపే చూస్తున్నారని కావున కార్యకర్తలంతా అందుకు తగ్గట్టుగా జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని అధికారం వైపుగా తీసుకువెళ్లాలని కోరారు. అదేవిధంగా సామాన్యుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే విధంగా, సమాజాన్ని నిర్మాణానికి చేయడంలో మన వంతు పాత్ర నిర్వర్తించాలని, మరియు ఈ రెండు నెలల సమయం చాలా ముఖ్యమైనదని అన్నారు. ఒక్కొక్క కార్యకర్త కనీసం 10 కుటుంబాలను ప్రభావితం చేసే విధంగా, జనసేన పార్టీ ఆలోచనలను ప్రజలకు చేరే విధంగా జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఏ రకంగా బీద బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొస్తామా ప్రజలకర్ధం చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com