అనంతపురం ( జనస్వరం ) : ముక్కోటి అంబిక సేవా చారిటబుల్ ట్రస్ట్ 2024 క్యాలెండర్ ను ట్రస్ట్ చైర్మన్ దంపేట్ల శివ గారు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని, రానున్న రోజుల్లో మరింత విస్తరిస్తామని అన్నారు. మనకు ఉన్నంతలో సాయం చేయడం మించిన తృప్తి మరొకటి ఉండదని అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేసిన సేవా కార్యక్రమాలను, తెలుగు పంచాంగం కలిపి ఒక సరికొత్త క్యాలెండర్ రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ కో-ఆర్డినేటర్స్ PRS అధ్యక్షులు శ్రీరాములు, కాపుసేన తోట ప్రకాశ్, అనంతపురం క్రీడా విభాగం వారు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com