తిరుపతి ( జనస్వరం ) : జనసేన పార్టీ జీడీ నెల్లూరు ఇంచార్జ్ పొన్న యుగంధర్ ఆధ్వర్యంలో కార్యాలయ ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. డా.పసుపులేటి హరిప్రసాద్ గారికి భారీ బైక్ ర్యాలీతో జీడీ నెల్లూరు జనసేన నాయకులు మరియు కార్యకర్తలు స్వాగతం పలికారు. జనసేన నియోజకవర్గ కేంద్ర కార్యాలయానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు, PAC సభ్యులు డా.పసుపులేటి హరిప్రసాద్ పార్టీ కార్యాలయం ప్రారంభించటం జరిగింది. అనంతరం భారీ భాహిరంగ సభ లో పాల్గొన్నారు. సభ అధ్యక్షతన వహించిన పొన్న యుగంధర్, ఈ కార్యక్రమంలో హరిప్రసాద్ గారు మాట్లాడుతూ జగన్ రెడ్డి వైసీపీ MLA లు చేస్తున్న అరాచకాలు అన్ని ప్రజలు తెలుసుకున్నారు. ఈసారి జగన్ రెడ్డికి తగిన బుద్ది చెప్తారని అన్నారు. రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తును ఇవ్వటమే పవన్ కళ్యాణ్ గారి లక్యం అని తెలియచేసారు. నిస్వార్థంగా పని చేసే ప్రతి ఒక్క కార్యకర్తకి మంచి భవిష్యత్ ఉంటుంది. 2024 లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి గా చూడటమే మన లక్ష్యం అని తెలియజేశారు.
అనంతరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు అక్రమ అరెస్టును జీడీ నెల్లూరు నాయకులు నిర్వహించిన నిరసన దీక్షకు జనసేన పార్టీ రాష్ట్ర PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ గారు, జీడీ నెల్లూరు ఇంచార్జ్ డా. పొన్న యుగంధర్ మరియు జనసేన నాయకులు సంఘీభావం తెలపటం జరిగింది. జనసేన తెలుగుదేశం సంయుక్తంగా వైసీపీని ఇంటికి పంపుతుందని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య, లోకనాథం నాయుడు, జిడి నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న, నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ అనుబంధ విభాగాల నాయకులు, పీలేరు ఇంచార్జ్ బెజవాడ దినేష్,వీర మహిళ విభాగం రాయలసీమ రీజినల్ కోఆర్డినేటర్ వనజ, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, జిల్లా కార్యదర్సులు ఆనంద్, కొట్టె సాయి, కలప రవి, భాను, సంయుక్త కార్యదర్శి బీగల అరుణ, జనసేన మహిళా నాయకులు లక్ష్మి లావణ్య జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు తమ్ముళ్లు, వివిధ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com