పాయకరావుపేట, జనస్వరం : నియోజకవర్గంలో నక్కపల్లి మండలంలోని జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి బోడపాటి శివదత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి శివదత్ మాట్లాడుతూ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలతో పాటు పార్టీ ఆవశ్యకత ప్రాముఖ్యతల గురించి ప్రతి గ్రామంలో ఇంటింటికి విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జనసేన పార్టీలో ఇటీవల నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జిల్లా, మండల స్థాయి కార్యవర్గ సభ్యులను పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ ఘనంగా సత్కరించారు. శుక్రవారం నక్కపల్లి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అభినందన సభలో వీరందరినీ పూల మాలలతో అభినందించి, శాలువాలతో సత్కరించారు. పార్టీ రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కమిటీ సభ్యుడు ఉమ్మి సంజీవరావు, అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవవరపు రఘు, కార్యదర్శులు ఆకేటి గోవిందరావు, పక్కుర్తి కృష్ణ, సంయుక్త కార్యదర్శులు కురందాసు అప్పలరాజు, పల్లి దుర్గారావు, పాయకరావుపేట అర్బన్ అధ్యక్షుడు ఆచంట దొర, పాయకరావుపేట మండల రూరల్ అధ్యక్షుడు యుగదాసు నానాజీ, నక్కపల్లి మండల అధ్యక్షుడు వెలగా సుధాకర్, ఎస్ రాయవరం మండల అధ్యక్షుడు పప్పల శివ, కోటవురట్ల మండల అధ్యక్షుడు సింగపురి శ్రీను, ఎన్నికల ప్రచార కమిటీ సభ్యుడు వెలమకాయల శ్రీను, ఎస్ రాయవరం మండల ముఖ్య నాయకులు బాబూరావు మాస్టారుతోపాటు మరికొందరు కార్యకర్తలను పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ ఘనంగా సన్మానించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com