Logo
Date of Publish : 30 May 2022, 8:44 am
Editor : Sake Naresh

బంగారుపాళ్యం మండలకేంద్రంలో ఘనంగా జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం

           పూతలపట్టు ( జనస్వరం ) : బంగారుపాళ్యం మండలకేంద్రంలో ఆదివారం మండల జనసేనపార్టీ అధ్యక్షుడు కోడి చంద్రయ్య ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంను ప్రభుత్వ అసుపత్రికి ఎదురుగా ప్రారంభించడం జరిగింది. ముందుగా బంగారుపాళ్యం ప్రభుత్వ కళాశాల వద్ద ఉన్న మహనీయుడు ప్రపంచమేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి జైభీమ్.. జైజై అంబేడ్కర్... జై జనసేన జైజై పవన్ కళ్యాణ్ అంటూ నినందించి పార్టీ కార్యాలయం వరకు భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ముందు జెండా ఆవిష్కరించి పార్టీ కార్యాలయం ప్రారంభించారు. అనంతరం వెయ్యి మందికి పైగా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ చీకూరుపల్లి సర్పంచ్ చీకూరి అమరావతి, రాష్ట్ర మహిళా కార్యదర్శి ఆరణి కవిత, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎ కె శరవణ, అఖిలభారత చిరంజీవి యువత చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పూల ప్రభాకర్, జిల్లా నాయకులు నానబాల లోకేష్ రాయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నరిగన్నగారి తులసీ ప్రసాద్, పూల చందు, పసుపులేటి దిలీప్, పగడాల రమణ, సంయుక్త కార్యదర్శి ఎ. నెహ్రూ రాయల్, జిల్లా అధికార ప్రతినిధి మునిరాజులు, యాదమరి మండల అధ్యక్షుడు కుమార్, ఐరాల మండల అధ్యక్షుడు పురుషోత్తం, తవణంపల్లి మండల అధ్యక్షుడు శివ, రాజశేఖర్, బంగారుపాళ్యం మండల ఉపాధ్యక్షులు జి.ఆర్. బాల సుబ్రహ్మణ్యం, కె.శివప్రసాద్, మునిరత్నం, యువత అధ్యక్షుడు ఎ.కిషోర్, గౌరవాధ్యక్షుడు శాంతమూర్తి, జనరల్ సెక్రెటరీలు పవన్, సోమశేఖర్, వెంకటేశు లు, కిరణ్, సి.అనిల్, సంయుక్త కార్యదర్శి మురగేష్, జనసైనికులు, వీరమహిళలు, నాయకులు, మెగా ఫ్యామిలీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com