● రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా వీర మహిళా విభాగం సమీక్ష సమావేశం
● పెండ్యాల శ్రీలత, జిల్లా నాయకులు పెండ్యాల హరి ఆధ్వర్యంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు ముస్లిం మత పెద్దలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున జనసేన పార్టీలోకి చేరికలు
అనంతపురం, (జనస్వరం) : రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత నూతనంగా ఏర్పాటు చేసిన అనంతపురం జిల్లామహిళా కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్, రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పసుపులేటి పద్మావతి నూతన మహిళా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పెండ్యాల శ్రీలత ఆధ్వర్యంలో వీర మహిళా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాయలసీమ మహిళా రీజినల్ కోఆర్డినేటర్లు పాల్గొని మహిళా సాధికారత, జనసేన పార్టీలో మహిళల పాత్ర, పార్టీ బలోపేతానికి వీర మహిళల కృషి వంటి పలు కీలక అంశాలపై చర్చించడం జరిగింది. అనంతరం పెండ్యాల శ్రీలత, పెండ్యాల హరి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలంలోని జనచైతన్య కాలనీకి చెందిన పలువురు ముస్లిం మత పెద్దలు, మహిళలు, యువకులు ఇతర పార్టీల నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం, ముస్లింల అభివృద్ధికి సచార్ కమిటీ విధానాలు, అప్పు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దడానికి షణ్ముఖ వ్యూహం వంటి పవన్ కళ్యాణ్ గారి గొప్ప ఆలోచన విధానాలను చూసి జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ ప్రధాన కార్యదర్శి భవాని రవి కుమార్, రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యులు పసుపులేటి పద్మావతి, ఆకుల వనజ, హసినా బేగం, సభాధ్యక్షురాలు కాశెట్టి సావిత్రి, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళి, జిల్లా ఉపాధ్యక్షులు జయారామిరెడ్డి, నగర అధ్యక్షులు బాబు రావు, రాయదుర్గం ఇంచార్జ్ మంజునాథ్ గౌడ్, రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్, జిల్లా కార్యదర్శులు కాశెట్టి సంజీవరాయుడు, చొప్పా చంద్రశేఖర్, రాపా ధనుంజయ, అవుకు విజయ్, కోన చంద్ర శేఖర్, నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, ఎంపీటీసీ అమర్ కార్తికేయ, వీర మహిళలు, జిల్లా, నగర కమిటీ సభ్యులు, మండలాల అధ్యక్షులు, కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.