Logo
Date of Publish : 01 October 2022, 4:05 pm
Editor : Sake Naresh

కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో దీన్ దయాల్ నగర్ లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ :

          నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 138వ రోజున 3 వ డివిజన్ దీన్ దయాల్ నగర్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన జెండాను ఘనంగా ఆవిష్కరించిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి, అనంతరం వారు ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలు ముగియగానే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడం తధ్యమని, అందుకు అంకురార్పణ నెల్లూరు సిటీ నియోజకవర్గం నుండే మొదలైందని అన్నారు. ఏ ఇంటి తలుపు తట్టినా తమను అపూర్వంగా ఆదరిస్తున్నారని అన్నారు. నగరంలో అనేక ప్రాంతాల్లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలు చేస్తున్నామని, వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పని చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు.. జీవన్, చిన్నా, మస్తాన్, పెంచలయ్య, హేమంత్ రాయల్, కుక్క ప్రభాకర్, కార్తిక్, వరప్రసాద్, దివాకర్,వినయ్, ఈశ్వర్, చరణ్, సాయి, ఇతర కార్యకర్తలు వీరమహిళలు శిరీష రెడ్డి, ఝాన్సీ, శశిరేఖ, లలిత తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com