Logo
Date of Publish : 11 May 2022, 9:45 am
Editor : Sake Naresh

టీమ్ పిడికిలి కోఆర్డినేటర్ మత్స పుండరీకం ఆధ్వర్యంలో రైతు భరోసా యాత్ర పోస్టర్లు ఆవిష్కరణ

      పాలకొండ, (జనస్వరం) : పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గ కేంద్రలో టీమ్ పిడికిలి రైతు భరోసా యాత్ర పోస్టర్లును జనసేన నాయకుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఎన్ని రాజు ఆవిష్కరించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న 3000 మంది కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడం కోసం అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులు ఇస్తూ ఆ కుటుంబ సభ్యుల్లో మనోధైర్యాన్ని కల్పిస్తూన్నారు. గత టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం చెయ్యలేని పనిని చేస్తున్నందుకు రాష్ట్ర ప్రజల్లో ఒక మార్పుకు శ్రీకారం చుట్టింది ఈ రైతు భరోసా యాత్ర అని జనసేన నాయకుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఎన్ని రాజు అన్నారు. జనసేన పార్టీ NRI విభాగం టీమ్ పిడికిలి రాజ మైలవరం 175 నియోజకవర్గాలకు  జనసేన పార్టీ రైతు భరోసా పోస్టర్లను పంపిచండం జరిగింది. అదేవిధంగా పాలకొండ నియోజకవర్గ కేంద్రలో ఈరోజు జనసేన పార్టీ నాయకులు టీమ్ పిడికిలి కోఆర్డినేటర్ మత్స.పుండరీకం ఆధ్వర్యంలో రైతు భరోసా యాత్ర పోస్టర్ లను ఆటోలకు, గోడలకు అతికించారు. ఈ కార్యక్రమంలో టీమ్ పిడికిలి నియోజకవర్గ సభ్యులు పోరెడ్డి ప్రశాంతి, పొట్నూరు రమేష్, గొర్ల మన్మధ, కడగల హరికృష్ణ, కర్ణేన పవన్ సాయి, బి.పి.నాయుడు, కంటు మురళి, వావిలపల్లి నాగభూషన్ తదితర నియోజకవర్గం జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com