
మంత్రాలయం ( జనస్వరం ) : మంత్రాలయం నియోజకవర్గంలో ఇంచార్జ్ బి. లక్ష్మన్న ఆధ్వర్యంలో టీం పిడికిలి వారు రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ దురదృష్టవశాత్తు అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు బాసటగా ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున అందిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ప్రజల్లోకి తీసుకువెళ్ళే విధంగా ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి జనసేన నాయకుడు రాజా మైలవరపు ఈ పోస్టర్లను అందించడం శుభపరిణామం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.