పుట్టపర్తి ( జనస్వరం ) : కొత్తచెరువు మండల జనసేన పార్టీ కార్యాలయం నందు మండల అధ్యక్షులు పూల శివప్రసాద్ ఆధ్వర్యంలో 2023 నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో కూడిన జనసేన పార్టీ సిద్ధాంతాలు ముద్రించబడిన 2023 నూతన సంవత్సర క్యాలెండర్లను ప్రతి ఇంటికి చేరే విధంగా ముద్రింప చేసి ఈరోజు ఉదయం జనసేన పార్టీ కొత్తచెరువు మండల అధ్యక్షులు పూల శివప్రసాద్, జనసేన పార్టీ నాయకులు మరియు జన సైనికుల ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నందు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు చేస్తూ వచ్చే ఎన్నికలలో తప్పక విజయం సాధిస్తామని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పూల వెంకటేష్, దాసరి శ్రీనివాసులు, పసుపులేటి సూర్యనారాయణ, దోడ్డిగుంట నరేంద్ర భూపతి, బోయ నాగమణి, మేడాపురం సల్లప్ప, పూల ప్రతాప్, ఓబిరెడ్డి, ముత్త నరేంద్ర, సోలంకల రాజా, మల్లేష్, పూల శ్యాంసుందర్, గుడా సోము, గొట్లూరు చిరంజీవి, బాల వెంకట్రాముడు, రాజేంద్ర, నారాయణస్వామి, సాయి శంకర్, అయ్యా నవీన్, చంద్ర రాయల్, రాజు, మూర్తి, అనిల్, ప్రవీణ్, కృష్ణ, రామంజి, బాలినేని గంగాద్రి, రమేష్, అంజి మరియు తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com