నెల్లిమర్ల ( జనస్వరం ) : నియోజకవర్గం పూసపాటిరేగ మండలం పూసపాటి గ్రామంలో జనసేన పార్టీ నూతన కార్యాలయం నియోజకవర్గ ఇన్చార్జ్ లోకం మాధవి గారి చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నాలుగు మండలాల జనసేన సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు వీర మహిళలు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పూసపాటిరేగ జంక్షన్ నుంచి ర్యాలీగా సుమారు 500 మంది ప్రజలతో శ్రీమతి లోకం మాధవి గారిని హారతులు మరియు పూలమాలలతో ఆహ్వానం పలికారు. లోకం మాధవి మాట్లాడుతూ పూసపాటిరేగలో కార్యాలయం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, మండల కార్యవర్గ సమావేశాలు నూతనంగా ప్రారంభించిన కార్యాలయంలోని ఏర్పాటు చేస్తామని కార్యకర్తలకు వీర మహిళలకు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ పాలన గురించి మాట్లాడుతూ 2019లో మహిళలను యువతను మాయమాటలు చెప్పి నమ్మించి జగన్ అధికారంలోకి వచ్చాడని వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా పెట్టుకొని ఇప్పుడు రకరకాల పనులకు వారిని వినియోగించి మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మద్యపాన నిషేధం పేరు చెప్పి మహిళలకు మోసం చేసి కల్తీ మధ్యన అంటగట్టి ప్రజల్ని దగ్గర డబ్బులు దోచేస్తున్నారని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టిడిపి ప్రభుత్వ స్థాపనకు తమకు పూర్తి మద్దతు తెలియజేయాలని ప్రజలకు కోరడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com