విశాఖపట్నం ( జనస్వరం ) : ఓటమి భయంతో ముఖ్యమంత్రి జగన్ అవగాహన రహితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ పార్టీ పిఏసి సభ్యులు కోన తాతారావు అన్నారు. ఈ మేరకు శనివారం ఉదయం పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని, వ్యక్తిగత విషయాలపై జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మూడు పెళ్లిళ్ల విషయంలో పవన్ లీగల్ గా వ్యవహరించారని, వారేమైనా పిర్యాదు చేశారా. అని జగన్ ను ప్రశ్నించారు. తల్లిని చెల్లిని వదిలేసిన జగన్ కు మహిళలపై ఏ పాటి గౌరవం ఉందో అర్ధం అవుతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది 30 వేల నుండి 40,000 మంది మహిళలు అదృశ్యం అవుతున్నారని, దానిపై జగన్ మాట్లాడాలన్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్నది తమ పార్టీ నిర్ణయమని, టిడిపితో పొత్తు పెట్టుకుంటే జగన్ కి ఏంటి బాధ అన్నారు. ఇసుక తరలింపు, లిక్కర్, మైనింగ్ మాఫియాలపై జాబ్ క్యాలెండర్, బైజుస్ కొనుగోలుపై దమ్ముంటే జగన్ మాట్లాడాలన్నారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని శివశంకర్ మాట్లాడుతూ విద్యాదీవనలో ఎడ్యుకేషన్ సిస్టం, విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగుల కోసం మాట్లాడాలని అలాకాకుండా పవన్ కళ్యాణ్ పై కామెంట్లు ఏంటని ప్రశ్నించారు. ప్రతిపక్షాలుగా ప్రభుత్వ అవినీతిని బయటపెట్టే హక్కుతమ పార్టీకి ఉందన్నారు. ఎంతోమంది సీనియర్ నాయకులు జగన్ బాధ భరించలేక పార్టీ నుండి జారుకుంటున్నారని, ముందు వారి సంగతి చూసుకోమని ఆయన ఎద్దేవా చేశారు. అధికారంలో ఉండేది జగన్ ఇంకా వంద రోజులే అని, అవాకులు చావాకులు మాట్లాడడం మానాలని సూచించారు. సమావేశంలో జన సైనికులు బి శ్రీనివాస్ పట్నాయక్, శివప్రసాద్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com