
విశాఖపట్నం ( జనస్వరం ) : యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం మర్రిపాలెం గ్రామానికి చెందిన 150మందికి పైగా వైఎస్సార్, టిడిపి పార్టీల నుండి జనసేనాని సిద్దాంతాల పట్ల ఆకర్షితులై జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యలమంచిలి ఇంఛార్జ్ సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువత మాట్లాడుతూ రాష్ట్రం బాగుపడాలి అంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి విజయ్ కుమార్ మాట్లాడుతూ నేడు రాష్ట్రం మొత్తం పవన్ కళ్యాణ్ గారు వైపు చూస్తూన్నారన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు తరానికి ఒక్కరు మాత్రమే పుడతారు అన్నారు. నేడు ఆయన ప్రతి కౌలు రైతు కుటుంబాన్ని ఆదుకోవడం చూసి దేశమే ఆయన కోసం మాట్లాడుతుండటం చూసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గడపగడపకు అని ప్రజల్లోకి ప్రతి గడపలోను చెంపదెబ్బలు చీపురులతో ఛీత్కారాలుతో ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరగలేక ప్రశ్నిస్తున్న ప్రజలపై కేసులు పెడుతున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో నూకన్నదొర, ఉరిటి నానాజీ, నానిపల్లి సన్యాసిరావులు పాల్గొన్నారు.