విశాఖపట్నంలో టీమ్ JCF ఆధ్వర్యంలో తమ స్వంత నిధులతో రోడ్ల మరమ్మత్తులు చేసిన జనసైనికులు
గత, ఇపుడు ఉన్న ప్రభుత్వాలు విశాఖపట్నంలో ఉన్న రోడ్లను పట్టించుకున్న పాపాన లేదు అని స్థానికులు అంటున్నారు. ఇక్కడ ఉన్న రోడ్లకు సరైన స్థితి లేదు కానీ రాజధాని నిర్మిస్తా౦ అనడం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు. వివరాల్లోకి వెళ్తే ఎన్నో సంవత్సరాలుగా మరమత్తులకు నోచుకోని సింధియా – గాజువాక ప్రధాన కూడలి లో అత్యంత ప్రమాదకరమైన గుంతలను తలపించే రహదారి ఉంది. ఇక్కడ వాహానదారులు కూడా ప్రమాదలకు గురవ్వడం చాలానే జరిగాయి. పలుమార్లు ప్రభుత్వ అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. ఈ విషయం జనసేన టీమ్ JCF సభ్యులకు తెలియగానే తమ స్వంత నిధులతో రోడ్లకు మరమ్మతులు చేశారు. టీమ్ JCF వారు మల్కాపురం పోలీసుస్టేషన్ ఎదురుగా మరమత్తులు చెయ్యడం జరిగింది. జనసైనికులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేశామని, అలాగే కరోనా బాధితులకి అండగా ఉన్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, మనోహర్, మహీంద్ర, పరమేష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.