విజయవాడ పశ్చిమంలో ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వం ప్రారంభం

విజయవాడ

   విజయవాడ ( జనస్వరం ) : పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించే ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వం కార్యక్రమం మొదటిరోజు 34 డివిజన్ అధ్యక్షులు ఆకుల రవిశంకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతన వెంకట మహేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఖుద్దూస్ నగర్ వద్ద ప్రారంభమై నాలుగు అడ్డ రోడ్ల వరకు జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి మహేష్ కరపత్రాలు అందజేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటుగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి వారు చేస్తున్న పోరాటాల గురించి తెలియజేసినారు ఈ సందర్భంగా స్థానికులు అనేక సమస్యలను మహేష్ దృష్టికి తెలియజేసినారు. వాటిలో ప్రధానంగా ఖుద్దుస్ నగర్ లో మురుగునీరు పారడం లేదని, చెత్త సరిగా ఎత్తడం లేదని, తిట్కో ఇళ్ల కోసం నాలుగు సంవత్సరాల కిందట డబ్బులు చెల్లించిన నేటి వరకు ఇల్లు అందలేదని, జగనన్న కాలనీల పేరుతో డబ్బులు కట్టాలని వాలంటీర్ల వేధింపులు ఎక్కువయ్యాయని, గతంలో కన్నా ప్రస్తుతం కిలో బొగ్గు రేటు 30 నుంచి 40 రూపాయల వరకు పెరగడం వలన రజకుల ఆదాయం తగ్గిపోయిందని వారి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మహేష్ మాట్లాడుతూ ఇంటింటికి రాబోయే జనసేన ప్రభుత్వం తధ్యమని ఏ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున మహేష్ గెలుపు నల్లేరు మీద నడికేనని, పశ్చిమ నియోజకవర్గంలో గాని విజయవాడలో గాని నిజమైన దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక్క వ్యక్తి కూడా నామినేటెడ్ పదవులు కేటాయించలేదని, కేవలం వారిని ఓటు బ్యాంకు గాని చూస్తున్నారని, దళితులని దగా చేసిన వ్యక్తిగా నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మరియు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఇదే విషయాన్ని స్థానిక కార్పొరేటర్ పుణ్యశీల గారు కూడా చెప్పారని తనకు ఇచ్చిన చైర్మన్ పదవి ఓసి కోటాలోనే గాని దళిత కోటాలో కాదని ఆ విధంగా పార్టీ ఎందుకు ప్రచారం చేస్తుందో తనకు తెలియదని వారు బహిరంగంగానే చెప్పారని ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు సమాధానం చెప్పాలని మహేష్ డిమాండ్ చేశారు. వారాహిపై అవాకులు చవాకులు పేలుతున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు వారాహి కి మెకానిక్ గా పని చేసుకోవాల్సిందని ప్రత్యేక పూజల కోసం పశ్చిమ నియోజకవర్గంలో వారాహి కొచ్చిన ప్రజాస్పందన చూసి తన ఓటమి ఖరారు అయిపోయిందని ఆరోజు నుండే వెల్లంపల్లి శ్రీనివాసరావుకు భయం పట్టుకుందని, ఆవిర్భావ సభకు పవన్ కళ్యాణ్ గారు వారాహిపై ప్రచారం చేస్తే లక్షలాది మంది జనం వారి వెంట నడిచారని అప్పుడే ఈ రాష్ట్రంలో వైసిపి పార్టీకి ఇదే చివరి అవకాశం అని అర్థమైందని అందుకే వారాహిపై అవాకులు చవాకులు పేలుతున్నారని మరొక మారు ఇలా మాట్లాడితే తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కొరగంజి వెంకటరమణ, రెడ్డిపల్లి గంగాధర్, తిరపతి అనూష, బత్తుల వెంకటేష్, సిగానంశెట్టి రాము, పొట్నరి శ్రీనివాసరావు, తమ్మిన లీలా కరుణాకర్, సోమి గోవింద్, ఏలూరు సాయి శరత్, n సంజీవరావు,స్టాలిన్ శంకర్, బోట్టా సాయి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way