సిద్ధవటం ( జనస్వరం ) : ఉప్పరపల్లిగ్రామపంచాయతీలోచేనేత కార్మికుల మగ్గాల వద్దకు వెళ్లి కార్మికుల సమస్యలు వారి బాధలు వింటూ ఉంటే చాలా ఘోరంగా ఉన్నాయని వైయస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేత కార్మికులకు అప్పులు ఎక్కువ పోయాయని రాజంపేట జనసేన పార్టీ నాయకులు యల్లటూరి శ్రీనివాసరాజు అన్నారు. పట్టు విపరీతంగా పెరిగిపోయిందని దానివల్ల కార్మికుల పోషణ బరువైపోయిందని చేనేత కార్మికులకు అందించే24 వేల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం వాటా 12 వేల రూపాయలు అందిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం 24 వేల రూపాయలు అందిస్తున్నామని పబ్లిసిటీ చేసుకుంటుందని అన్నారు. చేనేత కార్మికుల సమస్యలపై రాష్ట్ర అధినాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. మా పార్టీ అధికారంలో లేకున్నా ఎన్నో సేవా కార్యక్రమాలు మరియు రైతు కుటుంబాలకు ఆదుకుంటున్నామని రాజంపేట జనసేన పార్టీ నాయకులు శ్రీనివాస రాజు అన్నారు. చేనేత కార్మికుల మగ్గాలు వర్షాలు వస్తే వారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వారికి న్యాయం చేయాలని వచ్చే శాసనసభ ఎలక్షన్ లో జనసేన టిడిపి కూటమి అధికారంలోకి రాబోతుందని చేనేత కార్మికులకు ఆదుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు శివరామరాజు జనసేన వీర మహిళలు, లీగల్ సిల్ జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు రాష్ట్ర చేనేత వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి రాటాల రామయ్య, హరి రాయల్, జనసేన పార్టీమండల అధ్యక్షులు రాజేష్, పసుపులేటి కళ్యాణ్, ఆవుల నాగరాజు, నాగసుబ్బయ్య, అతి కారి అయ్యవారయ్య చేనేత కార్మికులు పాల్గొన్నారు.