సర్వేపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి సెపక్ తక్రా క్రీడా పోటీలలో రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ జిల్లాల క్రీడాకారుల పాల్గొన్నారు. పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు రెండు రోజులపాటు భోజన సదుపాయాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ మహిళా అధ్యక్షురాలు గుమినేని వాణి భవాని గారితో కలిసి శనివారం ఏర్పాటు చేసిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడ. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం క్రీడ రంగాన్ని ప్రోత్సహించడం, క్రీడాకారులకు అండగా ఉండడంలో జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుంది. రేపు రాబోయే జనసేన, తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వంలో క్రీడా రంగానికి పూర్తిస్థాయిలో అన్ని వసతులు కల్పించి ప్రోత్సహిస్తాం. వైయస్సార్సీపి ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే క్రీడారంగాన్ని ప్రోత్సహిస్తామని చెప్పి కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ప్రకటనలతోనే కాలయాపన చేసి నాసిరకమైన ఆట వస్తువులు వారికి అందించి క్రీడారంగాన్ని ముంచేసింది. క్రీడారంగాన్ని అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు. కాబట్టి కాలయాపన చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పి రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం ఉమ్మడి పరిపాలనలో క్రీడా రంగానికి పెద్దపీట వేస్తాం. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, అశోక్, వెంకటాచలం మండల కార్యదర్శి శ్రీహరి, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com