సర్వేపల్లి ( జనస్వరం ) : జనసేన, టీడీపీ పార్టీల పిలుపుమేరకు రోడ్లపై నిరసన వ్యక్తం చేయడం జరిగింది. వెంకటాచలం మండలంలో మరమ్మతులకు గురై గుంటలు ఏర్పడి దెబ్బతిన్న కనుపూరు - చౌటపాలెం రోడ్డుపై జనసేన, టీడీపీ పార్టీ నాయకులతో కలిసి వరి నాట్లు నాటి నిరసన వ్యక్తం చేశారు. జనసేన ఇంచార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇప్పటివరకు రోడ్లుపై ఏర్పడిన గుంటలలో తట్టెడు మట్టి వెయ్యలేదు. రాష్ట్ర ప్రజల తరఫున ఇప్పటికే పలుమార్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు జనసేన పార్టీ నివేదికల రూపంలో రోడ్ల దయనీయస్థితి, అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం అంటే దేశ స్థాయిలో ఒక మంచి గుర్తింపు ఉందన్నారు. అందుకు కారణం పూర్వపు ఉపరాష్ట్రపతి పెద్దలు ముప్పరపు వెంకయ్య నాయుడు సొంత మండలం కావడంతో అలాంటి మండలంలో వెంకయ్య నాయుడు గారి సొంత గ్రామానికి వెళ్లే రోడే గుంటలతో దారుణంగా తయారైంది. సర్వేపల్లి ప్రజలు రెండుసార్లు కాకాని గోవర్ధన్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించగా ఆయన మాత్రం ప్రజలకు చేసింది ఏమీ లేదు. మరమ్మత్తులో గురై అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను బాగు చేయించడానికి వైసీపీ ప్రభుత్వం వద్ద డబ్బులు లేకుంటే సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ అమ్మిన డబ్బులు ఎక్కడికి వెళ్లాయి. ఆ గ్రావెల్ డబ్బులను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కోసం ఖర్చు పెట్టడానికి ఎత్తి పెట్టుకున్నారా ?? మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు లేకుండా ఓడిపోవడం ఖాయమన్నారు. జనసేన, టీడీపీ పార్టీలు కలిసి రాబోయే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వెంకటాచలం మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్, తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరి రాధాకృష్ణ నాయుడు, జనసేన పార్టీ మండల నాయకులు శ్రీహరి, కాజా, అశోక్, మల్లి, తదితరులు పాల్గొన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com