అనంతపురం ( జనస్వరం ) : ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ… ప్రజా కంఠక ముఖ్యమంత్రిగా ఖ్యాతి వహించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వ పతనం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమవుతుందని జిల్లా అధ్యక్షులు మరియు అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ అన్నారు. చిత్తశుద్ధి నిబద్ధత కలిగిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై నగర సహాయ కార్యదర్శి ఆకుల అశోక్ ఆధ్వర్యంలో సోమ సుందరి, అనురాధ వారితో పాటుగా పెద్ద ఎత్తున మహిళలు మరియు యువకులు ఆదివారము జనసేన పార్టీలోకి చేరారు. రుద్రంపేట పంచాయితీలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు సభ అధ్యక్షతన వహించారు. టి.సి.వరుణ్, రాష్ట్ర కార్యక్రమాల కమిటీ ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, అంకె ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శులు పత్తి చంద్రశేఖర్ యువకులకు మరియు మహిళలకు పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీ.సి.వరుణ్ గారు మాట్లాడుతూ.. జనసేన పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి ఒక్కరికి సరైన సమయంలో సముచిత స్థానం లభిస్తుంది అన్నారు. అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి పనిచేయాలని, స్థానికంగా ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తానని మహిళలకు, యువకులకు సూచించారు. ప్రజా సమస్యలపై ఎక్కడికక్కడ పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు పత్తి చంద్రశేఖర్, కార్యదర్శులు రాపా ధనుంజయ్, సంజీవ రాయుడు, కిరణ్ కుమార్, జయమ్మ, అవుకు విజయకుమార్, నగర ఉపాధ్యక్షులు సదానందం, గ్రంధి దివాకర్, జక్కిరెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శిలు మేదర వెంకటేష్, వెంకటనారాయణ, హుస్సేన్, దరాజ్ భాష, కార్యదర్శిలు అంజి, శేషాద్రి, వడ్డే వెంకటేష్, వెంకటరమణ, ఆకుల ప్రసాద్ జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు సంతోష్, వీరమహిళలు అనసూయ, దాసరి సరిత, మంజుల మరియు నాయకులు చిరు, మారుతి, హరీష్ (రుద్రంపేట) చాందూ, నవీన్, నజీమ్, హిద్దు, విజయ్ దేవరయల్, నౌషాద్, తదితరులు పాల్గొన్నారు.