రాజంపేట ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పై నమ్మకంతో పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై రాజంపేట నియోజకవర్గంలోని బోయినపల్లి, కూచివారిపల్లి సాతుపల్లి మరియు పలు పంచాయతీల నుండి మరియు రాజంపేట నగరం నుండి 50 మంది పైగా యువత రాజంపేట జనసేన పార్టీ నాయకుల సమక్షంలో జనసేన కండువా కప్పుకొని చేరడం జరిగింది. నాలుగు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం లో జరిగే దాస్టికాలను, అరాచకాలను ఎదుర్కోవాలంటే బలమైన నాయకత్వం అవసరమని ఉపాధి లేక విదేశాలకు, పక్క రాష్ట్రాలకు వలస వెళుతున్న యువతకు కేవలం జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని, అప్పుల పాలైన రాష్ట్రం మళ్ళీ పునర్వైభవం రావాలంటే జనసేన పార్టీ అధికారం లోకి రావాలని బలంగా నమ్మి యువత జనసేన వైపు అడుగులు వేస్తుంది అని త్వరలో వేలాదిమంది వివిధ వర్గాల నాయకులు , మహిళలు, యువకులు, మేధావులు జనసేన పార్టీలో పార్టీ రాష్ట్ర నాయకుల సమక్షంలో చేరబోతున్నారని రానున్న ఎలక్షన్లలో సరికొత్త నాయకత్వం ద్వారా రాజంపేటలో జనసేన జెండా ఎగురవేసి ప్రజా అవసరాలను తీర్చి, రాజంపేట ను నిజమైన అభివృద్ధి వైపు నడిపిస్తామని రాజంపేట జనసేన పార్టీ నాయకులు బాలసాయి కృష్ణ మీడియా ను ఉద్దేశించి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది మరియు రాబోయే కాలంలో పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తామని సుంకేసుల చౌడయ్య, గవ్వలపూరి మునీంద్ర గారు తెలిపారు. పార్టీ లో చేరిన యువత మాట్లాడుతూ రాబోవు రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం అభ్యర్థిగా చూడాలని యువత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన పార్టీ నాయకులు కోలాటం హరికృష్ణ , నంద్యాల హరికృష్ణ, చెంగలగారి గోపీకృష్ణ , పోలిశెట్టి శ్రీనివాసులు , జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బరాయుడు, సీనియర్ నాయకులు భాస్కర పంతులు యువ నాయకులు సుంకేసుల చౌడయ్య, గవ్వలపూరి మునీంద్ర, మొహమ్మద్ హుస్సేన్, ఆలిశెట్టి హరీష్, మామిడిపాక హరీష్, మైసూర్ గౌతమ్, పళని, హరి, భాను, నరసింహ, ఆనంద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com