Logo
Date of Publish : 15 November 2023, 10:05 pm
Editor : Sake Naresh

బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీ నుంచి జనసేనలోకి భారీ చేరికలు

       తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలో వైసీపీ నుంచి జనసేనలోకి మంగళవారం నీలపల దినేష్ మరియు అడపా ప్రసాద్ అధ్యక్షతనలో భారీ చేరికలు జరిగాయి. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ చేతులమీదుగా వైసీపీ ఎంపీటీసీ, వార్డు నెంబర్, మరియు సీనియర్ నాయకులు,వారి అనుచరులు 50 మందికి పైగా జనసేన కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ అధికార వైసీపీ పార్టీపై విమర్శలు గుప్పించారు. పార్టీలో మొదటి నుండి ఉంటున్న వాళ్లకు అన్యాయం జరుగుతుందనీ పార్టీ కోసం కష్టపడిన వారిని వైసీపీ చిన్న చూపు చూస్తుందని, ఈ నాలుగున్నర ఏళ్లలో జగన్ ప్రభుత్వంతో తీవ్ర నష్టాలలో మిగిలిపోయిందనీ ప్రజల సమస్యలపై పవన్ కళ్యాణ్ పోరాటం చూసే జనసేనలోకి వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా చేరుతున్నట్టు తెలిపారు. అంతేకాకుండా కొట్టు సత్యనారాయణ గురించి మాట్లాడుతూ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో తాడేపల్లిగూడెం పట్టణానికి మరియు గ్రామాలకి వైసీపీ ప్రభుత్వం నుంచి అభివృద్ధి పనులు చేసింది ఏమీ లేదని, రోడ్ల పరిస్థితి, ఇసుక దోపిడి, "కే"టాక్స్, వంటివి ప్రజలు వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నారని, మోసపూరిత మాటలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని వివరించారు. ఈ కార్యక్రమంలో నీలపాల వీరాస్వామి, అయినపర్తి శ్రీనివాస్, మరిడి కృష్ణారావు, నీలపాల సత్యనారాయణ, మువ్వ శ్రీను, అడ్డాల శివ, నీలపాల గణేష్, బూర్ల భవాని, వెంపల సాయి, అడపా గంగాధర్, మణికొండ కిరణ్ మరియు తాడేపల్లిగూడెం జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com