– విజయవాడ 34వ డివిజన్ లో ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమం
– ప్రభుత్వంపై జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన మహేష్
విజయవాడ, డిసెంబర్ 16 : ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 34వ డివిజన్ లో అధ్యక్షులు ఆకుల రవిశంకర్, డివిజన్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఖుద్దూస్ నగర్ నక్షత్ర బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లో నుంచి ఆరంభించి పలు ప్రాంతంలో పర్యటిస్తూ ప్రజలను కలుస్తూ సమస్యలను జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ 34వ డివిజన్లో ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇంటింటికి పథకం కాదు ఇంటింటికి 15 రకాల పన్ను పోట్లు విధించిన సీఎం జగన్నని, ప్రజలకు ఇచ్చిన పథకాల డబ్బు మొత్తం ప్రజల దగ్గర నుంచే పన్నుల రూపంలో సీఎం జగన్ ముక్కు పిండి వసూలు చేస్తున్నారని తెలియజేశారు. ఏ పథకం అమలు చేసిన ఆ పథకానికి ఒక కొత్త రకం పన్నుని ప్రజలపై విధించరన్నారు. జగన్ పన్నులతో వేస్తున్న వెన్నుపోట్ల నుంచి రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం తప్పించుకోలేకపోయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాయిస్ ఆఫ్ మాల మహానాడు అధ్యక్షులు శ్యామ్, తంబి, అల్లం రమేష్, పాలేటి మోహన్రావు, ప్రశాంత్, వెన్న శివశంకర్, బట్ట సాయికుమార్, పాల రజిని, లకనం శ్యాం ప్రసాద్, మారాజు రమణ, దాసరి నాగరాజు, పిల్ల రవి, శివ, డివిజన్ కమిటీ సభ్యులు , వాయిస్ ఆఫ్ మాల మహానాడు కమిటీ సభ్యులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.