సర్వేపల్లి ( జనస్వరం ) : మిచౌంగ్ తుఫాన్ కారణంగా గుడిసెల్లోకి నీళ్లు వచ్చేసి అస్తవ్యస్తంగా ఇబ్బందులు పడిన సర్వేపల్లి నియోజకవర్గంలో పేద బడుగు, బలహీన వర్గాలకు ఇప్పటికీ ఆర్థిక సహాయం అందకపోవడంతో జనసేన నాయకులు వాపోయారు. తోటపల్లిగూడూరు మండలం పాపిరెడ్డిపాలెం పంచాయతీలోని అరుంధతి వాడను సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సందర్శించారు. ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హిజ్రాల మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాం. సర్వేపల్లి నియోజకవర్గంలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించిన పేద బడుగు బలహీన వర్గాలకు తుఫాన్ నష్టపరిహారం అందివ్వలేదు. దీనికి గల కారణం కులాల, వర్గాల, పార్టీలపరంగా వర్గీకరించి ఆర్థిక సహాయం అందిస్తారా లేదంటే గుడిసెల్లోకి నీళ్లు వచ్చేసి సరిగ్గా కాలవలు లేక నీళ్లు పోలేక ఆ నీళ్లన్నీ ఇళ్లల్లోకి వచ్చేసి ఇళ్లల్లో గుడిసెల్లో ఉండలేక తిండికి బట్టకి ఇబ్బందులు పడి ఐదు రోజులు పాటు అస్తవ్యస్తంగా అధ్వానంగా వాళ్ళ పరిస్థితులు ఎదుర్కొంటే మీరు ఆర్థిక సహాయం అందించకపోగా కనీసం గ్రామాలలో బ్లీచింగ్ కొట్టిన పరిస్థితి కూడా లేదు. మేము జనసేన పార్టీ ఒక్కటే కోరుతున్నా పేద బడుగు బలహీన వర్గాలు ఐదు రోజులపాటు తుఫాను కారణంగా ఇబ్బందులు పడిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క గుడిసెకి నష్టపరిహారం అందించాలి అలా అందించిన పక్షంలో జనసేన పార్టీ ఉద్యమం చేసే వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాడుతుంది సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ ఒక క్షణం ఆలోచించండి. ఈ హిజ్రాల మంత్రిని డిపాజిట్లు లేకుండా తరిమి కొట్టి హిజ్రాల పార్టీని ఈ రాష్ట్రం నుంచి సాధనపుదాం 2024 లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించి మన గ్రామాలని మన మండలాలని మన జిల్లాలని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళ గుమ్మినేని వాణి భవాని, మండల నాయకులు k. శ్రీనివాసులు, M. శరత్ బాబు, వీర మహిళ జయసుధ, K. నారాయణ,V. లక్ష్మీనారాయణ, D.V. రమణయ్య D.రమణయ్య , V.బాబు, పేడూరు గ్రామ నాయకులు వినోద్. శరత్. వినయ్. దినేష్. తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com