నెల్లూరు ( జనస్వరం ) : కోవూర్ నియోజకవర్గం జమ్మిపాలెం గ్రామంలో అక్రమంగా కోట్ల రూపాయల ఇసుక రవాణా అవుతుంది. 10 ట్రాక్టర్లు ఒకదానికి మాత్రం జగనన్న లేఔట్ కు తోలుతున్నట్లు స్టికర్ ఉన్నా… గుమ్మల దిబ్బ ప్రాంతంలో అందుబాటులో ఉన్న ఇసుక రీచ్ ను వదిలేసి ఇక్కడ ఎందుకు తోలుతున్నారనేది ప్రశ్నార్థకమే…? అని ప్రశ్నిస్తూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఉపాధ్యక్షుడు బద్దిపూడి సుధీర్ ఆ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కిలోమీటర్ల మేర 30 అడుగుల పైబడి అక్రమంగా ఇసుకను తవ్వుతున్నారు. వీటి అనుమతులలేవని అడిగీతే చూపించే పరిస్థితి లేదు. సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారి అనుచరుల పర్యవేక్షణలో జాగ్రత్తగా అక్రమ ఇసుక దందా నిర్వహించబడుతుంది అనేది ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. మీడియా మిత్రులకు సమాచారం ఇచ్చినా కూడా ఎమ్మార్వో గారు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు .మమ్మల్ని ఇన్వాల్వ్ చేయవద్దు అని తప్పించుకునే ప్రయత్నం జరుగుతుంది . రోజుకు దాదాపుగా 50 నుంచి 100 ట్రాక్టర్లు ఇక్కడ నుంచి అక్రమంగా రమణా తరలిపోతుంది. గుమ్మల దెబ్బ ప్రాంతానికి జగనన్న లేఔట్లకు తోలుతున్నామని చెప్పిన వాహన చోదకులకు ఆ పరిసరాల్లో ఉన్న ఇసుక ఉంది కదా అని ప్రశ్నిస్తే గా సమాధానం లేదు.పై పెచ్చు ఇక్కడి నుంచి బయటికి వెళ్లి పోవాలంటూ… అక్కడ ఉన్నవారు దౌర్జన్యానికి దిగారు. ఎక్కడ వీలైతే అక్కడ అక్రమంగా దోచుకుంటున్న వైసీపీ నాయకులకి నాయకులను నిలదీయాల్సిన పరిస్థితి ఉంది. మైనింగ్ డిపార్ట్మెంట్ కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి కలెక్టర్ గారికి అర్జీలు ఇస్తాం ఇష్టమొచ్చినట్లు తవ్వుకొని బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ సామాన్యుడికి ఇసుక అందని పరిస్థితి. ఇసుక అక్రమ రవాణా ఆగేంత వరకు కూడా జనసేన పార్టీ అధిష్టానం తెలియజేసి ఈ విషయంలో పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఉపాధ్యక్షుడు బద్దిపూడి సుదీర్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, సిటూ కార్యదర్శి హేమచంద్ర యాదవ్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.