తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : పెంటపాడు మండలం దర్శిపర్రు గ్రామంలో రెండవ రోజు పల్లెపోరు విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి శ్రీనివాస్ తనయులు రాజేష్ ఇంటింటికి తిరుగుతూ జనసేన యొక్క మేనిఫెస్టో కరపత్రం పంచిపెట్టారు. రాజేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థపై ప్రజలు ప్రశ్నిస్తే పథకాల పేరుతో ప్రజల్ని భయభంతులు చేసి వాళ్ళ నోరుల్ని నొక్కేస్తున్నారని ఈ నాలుగున్నర సంవత్సరాలు అభివృద్ధి పనులకు వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నీ మరో 15 సంవత్సరాలు వెనక్కి నెట్టేసిందనీ బొలిశెట్టి రాజేష్ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం అధ్యక్షులు పుల్లా బాబీ పెంటపాడు మండల పల్లేపోరు నిర్వహణ కమిటీ జగత్ సోమశేఖర్, స్థానిక నాయకులు జనసేన సర్పంచ్ కోలా శేషవేణి, ఉపసర్పంచ్ కోలా మార్కండేయులు, వీరంశెట్టి పలపరాజు, పాలూరి భూపాల్, ఐతం వెంకన్న బాబు, సుంకర సంతోషం, దంగేటి అన్నవరం, ఏపూరి కోటి, దాసరి నాగభూషణం తదితరులు మరియు తాడేపల్లిగూడెం జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com