నెల్లూరు ( జనస్వరం ) : కోట్ల రూపాయల వ్యయంతో అత్యధిక అత్యధిక సాంకేతిక పరికరాలతో అనుభవిజ్ఞానమైన వైద్యులతో నెల్లూరు కే తలమానికంగా నిలుస్తుంది అనుకున్న ఏసీ నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో నిర్లక్ష్యం తాండవిస్తుందా అనిపిస్తుంది. ఒకే రోజున ఆక్సిజన్ అందక ఎనిమిది మంది చనిపోయారని సమాచారంతో అక్కడ చేరుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ సూపర్డెంట్ గారిని విషయం అడిగి తెలుసుకున్నారు. మోస్ట్ ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్న 6 మందే చనిపోయారని ఆక్సిజన్ లేక పోవడం వల్ల కాదని అన్ని సాంకేతిక పరికరాలు సజావుగా పనిచేస్తున్నాయని చెప్పారు. గత వారంలో బ్రెయిన్ షాక్ వచ్చిన వ్యక్తికి ఎమ్మారై స్కానింగ్ కి రాక స్కానింగ్ యుపిఎస్ పనిచేయడం లేదు జనరేటర్ లేదు అని సెలవిచ్చారు అదే విధంగా కర్ణాటకలో ఆధార్ కార్డు కలిగి ఉన్న వ్యక్తికి నెల్లూరులో ఉండగా అపెండిసైట్ రాగా ఇక్కడ ఆరోగ్య మిత్ర లేదు అని చెప్పారు. వాటిని గురించి పరిశీలించమని ఆయా పేషెంట్లకు ఫోన్ చేసి సంభాషణను వినిపించారు. అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ…. నెల్లూరు కే తలమానికంగా నిలవాల్సిన ఈ ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యంతో మరుగున పడుతుంది. ఆరోగ్య మంత్రి విడుదల రజిని గారు కోట్ల రూపాయల ఖర్చుతో వీడియో సెల్ఫ్ ప్రమోషన్ లో ఉన్నారు. ప్రజల ఆరోగ్యానికి మెరుగుపరిచే ప్రభుత్వ ఆస్పటల్ పట్టించుకునే పరిస్థితిలో లేరు. గత వారంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తి స్కానింగ్ కి జనరేటర్ పనిచేయట్లేదు అని ఫ్రంట్ డెస్క్ సిబ్బంది సెలవిచ్చారు. కర్ణాటకలో ఉన్న ఆధార్ కార్డు కలిగిన వ్యక్తికి అపెండిసైటిస్ కి ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాల్సి ఉంటే ఇక్కడ మేము చేయలేము అని సిబ్బంది సెలవిచ్చారు. కోట్ల రూపాయల పరికరాలు అనుభవం గల డాక్టర్లు జిల్లాలోనే అతిపెద్ద మెడికల్ కాలేజీ గా అవతరించినప్పటికీ, నిర్లక్ష్యం వల్ల జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కి చెడ్డ పేరు వస్తుంది. గతంలో మిత్రులు సామాజిక వాదులు ఒకటిన్నర నెల ఫైట్ చేస్తే కానీ గర్భిణీ వార్డులు ఉండే లిఫ్టుల్ని పనిచేయించలేకపోయారు. కోట్ల రూపాయల వెనకేసుకుంటున్న నాయకులు ప్రజల ఆరోగ్య పరిస్థితిని పట్టించుకునే పరిస్థితిలో లేరు. కలెక్టర్ గారు నివేదిక తెప్పించుకొని లోటుపాట్లు ఉంటే సరి చేయాల్సింది ,ఈ విషయంలో ఎవరి పొరపాటు వలన గాని ఈ మరణాలు సంభవించి ఉంటే కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో మొట్టమొదటి ప్రజలకు నాణ్యమైన విద్య వైద్య సౌకర్యాలు పెంపొందించడం అని తెలిపారు. నాయకులు వారికి నాణ్యమైన వైద్యం కావాలంటే జిల్లాలు రాష్ట్రాల దాటే పరిస్థితి. అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉన్నట్టు ప్రజలకు జిల్లా వాసులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉపయోగకరంగా లేదని స్పష్టంగా చెప్పగలము. నాయకులు అధికారులు స్పందించి ఫ్రంట్ డెస్క్ లో వాళ్ళకి విషయపరిజ్ఞానం అందించి ఆసుపత్రిలో వైద్య వైద్య సౌకర్యాలు మెరుగుపరచవలసిన అవసరం ఉంది. లేకుంటే జనసేన పార్టీ తరఫున నిరసనలు చేసి ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని చేరవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, శరవణ మౌనేష్, కార్తీక్, ప్రసన్న, నారాయణ, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.