రామచంద్రపురంలో ఇల్లు కాలిపోయిన కుటుంబానికి రూ. 16 వేల మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసైనికులు
రామచంద్రపురం నియోజకవర్గం, కాజులూరు మండలం, శీల గ్రామంలో దళిత పేటలో నివసిస్తున్న కాండ్రకోట జయలక్ష్మీ గారి పూరిపాక షాట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమవడంతో వారికి మన జనసేన పార్టీ తరపున NRI మిత్రులు మరియు జనసైనికుల సహకారంతో జెడ్పీటీసీ అభ్యర్థి శ్రీ డేగల సతీష్ గారి చేతుల మీదుగా 16,000/- రూపాయిల ఆర్థిక సాయం మరియు ఒక రైస్ బ్యాగ్ ను అందివ్వడం జరిగింది. అధికారంలో ఉన్నా లేకున్నా ఆపదలో ఉన్న వారిని ఆడుకోవడం అనేది జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం అని శ్రీ డేగల సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు లకాని కృష్ణ చైతన్య, నున్న విష్ణు మూర్తి, కూనపరెడ్డి శివ, గొల్లపల్లి చిన్న, బత్తుల సూరిబాబు, మహాలక్ష్మీ రావు మరియు జనసైనికులు సూర్య, మణి, సాయి, వాసిరెడ్డి సతీష్, వాసిరెడ్డి శ్రీను, పులుపు రాజు, గరగా సునీల్, మణిరామ్ కుమార్, జీ. తేజ మరియు ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా అడుగులు వేసి గ్రామస్తులను ఏకం చేసిన జనసైనికుడు వాసిరెడ్డి సతీష్ ను జనసేన పార్టీ నాయకులు డేగల సతీష్ అభినందించడం జరిగింది.